జాతర్ల సందడి షురూ.. సంక్రాంతికి తెలంగాణలో జరిగే జాతరలు ఇవే!

Updated on: Jan 13, 2026 | 12:53 PM

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణలో ఉండే సందడే వేరు. జనవరి సమయంలో తెలంగాణలో అంగరంగ వైభవంగా జాతర్లు జరుగుతుంటాయి. ఇక్కడి ప్రజలు ఈ సమయంలో ఎక్కువగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సంక్రాంతి పండుగ సమయంలోనే కొన్ని స్పెషల్ జాతరలు జరుగుతాయి. కాగా, అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కొత్త కొండ జాతర : సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే జరిగే స్పెషల్ జాతరలో కొత్తకొండ జాతర ఒకటి. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతి పెద్ద జాతరగా ఇది పేరుగాంచింది. ఇక్కడ కొండ మీద కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారికి గుమ్మడికాయలు కోరమీసాలు ప్రత్యేకంగా సమర్పిస్తారు. భోగి పండుగ రోజున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్స్‌లలో చాలా మంది భక్తులు కొత్తకొండకు బయల్దేరుతారు. ఈ జాతరకు దాదాపు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారంట. తెలంగాణలో ఫేమస్ జాతరలో ఇదొక్కటి.

2 / 5
 కొముర వెల్లి మల్లన్న జాతర : దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే. జనవరి సమయంలో మల్లన్న స్వామి ఆలయం మొత్తం భక్తులతో నిండిపోతుంది. ఇక్కడ పట్నాలు, పసుపు బండారితో స్వామి వారిని పూజించడం, గంగరేణి చెట్టుకింద పట్నాలు వేసి, శివసత్తుల ఆటలతో, ఒగ్గు కథలతో దద్దరిల్లిపోతుంది.  ఇక్కడ మరో విశేషం ఏమిటంటే? ఇక్కడ శివుడు వ్యక్తి రూపంలో లింగ దర్శన  ఇస్తాడు. తెలంగాణలోని అద్భుతమైన ఆలయాల్లో కొమురవెళ్లి మల్లన్న స్వామి ఆలయం ఒకటి.

3 / 5
ఐనవోలు జాతర : తెలంగాణలోని ఫేమస్ ఆలయాల్లో ఐనవోలు జాతర కూడా ఒకటి. హన్మకొండ జిల్లాలో ఈ ఆలయం ఉంది. కాకతీయ కాలంలో నిర్మించిన ఈ గుడి, చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇక్కడ మల్లిఖార్జున స్వామి కొలువుదీరాడు. ఇక్కడ కూడా పట్నాలు వేసి, బోనాలతో స్వామి వారికి మొక్కుల తీర్చుకుంటారు. చాలా వరకు ఐనవోలు మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కొముర వెళ్లి మల్లిఖార్జున స్వామి వారిని దర్శించు కోవడం ఆనవాయితీ.

4 / 5
సమ్మక్క , సారలమ్మ జాతర : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర రెండు సంత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ అమ్మవార్లు కుంకుమ భరణి రూపంలో దర్శనం ఇస్తారు. జంపన్న వాగు, చాలా ప్రత్యేకమైనది. వన బిడ్డల జన జారగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. అమ్మవార్లకు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక జనవరి 28 నుంచి ఈ జాతర మొదలు కానుంది.

5 / 5
నాగోబా జాతర : ఆదిలాబాద్ జిల్లాలో జరిగ అతి పెద్ద జాతర నాగోబా జాతర. ఇది గిరిజనుల అతి పెద్ద పండుగ. ఇక్కడ గోండులు నాగేంద్రుడిని దేవుడిగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపు 10 రోజుల పాటు చాలా ఘనంగా ఈ పండుగ జరుగుతుంది.