
ఈ కార్తీక పౌర్ణమి శుభ సమయాల గురించి తెలుసుకుంటే, నవబర్ 5 వ తేదీన వచ్చే ఈ కార్తీక పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనదంట. ఈ సారి, కార్తీక పూర్ణిమ నవంబర్4వ తేదీ 10.36 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 5వ తేదీ 6.48 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఈరోజు నవంబర్ 5న సాయంత్రం వరకు పూజలు చేసుకోవచ్చునంట.

అయితే ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అంతే కాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సారి దీనికి చాలా విషిష్టత ఉన్నదంట. ఎందుకంటే? ఈ రోజు, శ్రీహరి, హరుడు, లక్ష్మీదేవి ఇలా ముగ్గురు దేవతలకు అంకితమైన రోజు. అలాగే ఈరోజున దేవతలు భువిపైకి గంగానది స్నానానికి వస్తారని నమ్మకం.

ఇక ఈరోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మూడు యోగాలు ఏర్పడ నున్నాయి. సర్వసిద్ధియోగం, అమృత సిద్ధి యోగం, అశ్విని నక్షత్రం వీటి కలయిక జరగడం వలన ఈ రోజు చాలా పవిత్రమైనదంట. కోరిన కోర్కెలు నెరవేరుతాయంట.

నవంబర్ 5వ తేదీన వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తారో, వారు కోరిక కోర్కెలు నెరవేరుతాయంట. అలాగే ఎవరైతే ఈరోజున లక్ష్మీదేవిని మనస్పూర్తిగా పూజిస్తారో, వారికి అప్పుల సమస్యలు తొలిగిపోయి, ఇంటిలో కాసుల వర్షం కురుస్తుందని చెబుతున్నారు పండితులు.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)