- Telugu News Photo Gallery Spiritual photos Gajakesari Raja Yoga brings unexpected financial gains to those born under five zodiac signs
గజకేసరి రాజయోగం.. వీరికి ఊహించని ధన లాభం!
బృహస్పతి , చంద్రుడు కలిసినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అయితే అక్టోబర్ చివరన గజకేసరి రాజయోగం ఏర్పడ బోతుంది. ఇది 12 రాశులను ప్రభావితం చేయగా, ఐదు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.
Updated on: Oct 29, 2025 | 6:34 PM

మేష రాశి : మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అక్టోబర్ చివరన ఏర్పడే గజకేసరి రాజయోగం వలన నాలుగు రాశుల వారికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయంట. అంతే కాకుండా ఈ రాశిలోని ఉన్న వారు ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేస్తారో, వారి కోరిక నెరవేరనున్నదంట.

కన్యా రాశి : కన్యారాశి వారికి గజకేసరి రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. అంతే కాకుండా ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు.

వృశ్చిక రాశి : గజకేసరి రాజయోగం వలన వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడుల నుంచి చాలా లాభాలను పొందుతారు. అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతారో, వారికి కూడా కలిసివస్తుందంట. కొత్త ఇల్లు లేదా భూమి కొనాలని ఆలోచిస్తున్న వారికి గురు బలం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

మకర రాశి : గజకేసరి రాజయోగం, బృహస్పతి అనుగ్రహం వలన మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. వీరికి వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. అంతే కాకుండా, వీరికి చాలా రోజుల నుంచి ఉన్న అప్పుల సమస్యలు తీరిపోయి, ఆర్థికంగా చాలా బలంగా ఉంటుందంట.

తుల రాశి : తుల రాశి వారికి బృహస్పతి గ్రహం చాలా బలాన్ని ఇస్తుంది. వీరి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం మార్పు కోరుకుంటారో, వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం విషయంలో కలిసి వస్తుంది.



