
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా మంది తమ రాశుల ప్రకారం జాతకం తెలుసుకుంటారు. తమ కెరీర్, భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రమే కాకుండా, సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వారిపై కుబేరుడి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ తేదీల్లో జన్మించిన వారిపై కుబేరుడి ఆశీర్వాదం ఉంటుంది.

సంఖ్యాశాస్త్రం ప్రకారం, 7,16,25వ తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య అనేది 7. అయితే ఎవరు అయితే ఏడవ తేదీన జన్మిస్తారో వారికి లక్కు కలిసి వస్తుందంట. వీరికి కేతువు అధిపత్యం వహించడం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి కుబేరుడి అనుగ్రహం ఎక్కువగా ఉండటం వలన సంపదకు లోటు ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

ఇక మూల సంఖ్య 7వ తేదీల్లో జన్మించిన వారికి కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందంట. దీని వలన వీరు ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా జీవిస్తారంట. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అలాగే వీరిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉండటం వలన డబ్బుకు లోటు ఉండదంట. అలాగే ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

కుబేరుడు ఈ తేదీల్లో జన్మించిన వారిపై ప్రత్యేకంగా దృష్టిపెడతాడని చెబుతున్నారు పండితులు. దీని వలన ఈ తేదీల్లో జన్మించిన వారికి డబ్బు కష్టాలు ఉండవంట. వీరిని కుబేరుడు నిత్యం ప్రేమిస్తూ.. ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అలాగే వీరు ప్రతి పనిలో నిత్యం విజయం సాధిస్తూ చాలా ఆనందంగా గడుపుతారంట. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వీరిపై కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఎక్కువగా ఉంటుందంట.

ఇక కుబేరుడి అనుగ్రహం వలన మూల సంఖ్య 7లో జన్మించిన వారికి ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది కానీ, వీరిని అర్థం చేసుకోవడం కష్టమంట. కేతువు ప్రభావం వలన వీరు చాలా రహస్యంగా ఉంటారంట. అంతే కాకుండా, వీరు కష్టపడి పని చేసే వారు, సొంత మార్గాలకు దూరంగా ఉంటారని, కానీ అన్ని విషయాల్లో చాలా సులభంగా విజయం సాధిస్తారంట.