కుంభం: వాహన ప్రమాదాలు, కలుషితాహార సేవనం, వ్యసనాలు, అనవసర పరిచయాలు వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శస్త్రచికిత్సల వరకూ వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. కొద్దిపాటి అనారోగ్యమే అయినప్పటికీ, డాక్టర్లను సంప్రదించడం మంచిది. విందులకు కూడా దూరంగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం
ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు మాటల వల్ల నష్టపోవడం జరుగుతుంది. వేగంగా వాహనాలను నడపడం, వాహనాలలో దూర ప్రయాణాలు చేయడం వంటివి పెట్టుకోవద్దు.