
మేషం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో రవితో కలిసినందువల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇతర సంస్థల నుంచే కాక, విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల వారికి దశ తిరుగుతుంది. ఈ రాశివారు ప్రభుత్వ అధికార ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది.

సింహం: రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ఒక సంస్థకు లేదా విభాగానికి అధిపతి అయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది.

తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, కుజుల సంచారం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో కెరీర్ లో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఎక్కడ, ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలుగుతారు. కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగపరంగా శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో రవితో కలవడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. జీవితం అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. ఆదాయపరంగా కూడా ఊహించని వృద్ధి ఉంటుంది. విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబం కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది. అనేక విధాలుగా భూ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలతో పాటు షేర్లలో కూడా ధన యోగాలు కలుగుతాయి.

ధనుస్సు: ఈ రాశిలో ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన రవి, కుజులు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లి వచ్చే సూచనలున్నాయి.

మీనం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, రవుల యుతి జరగడం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, ఒక సంస్థలో సర్వాధికారి కావడం, విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు అధికార యోగం పడుతుంది. ఊహించని విధంగా ఒక ప్రముఖుడుగా, ఒక సంపన్నుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది.