మరణం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? గరుడ పురాణంలో చెప్పిన షాకింగ్ నిజాలు!

Updated on: Jun 29, 2026 | 5:38 PM

మనిషి ప్రాణం పోయిన మరుక్షణం ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం ప్రాణంగా ప్రేమించిన ఆ శరీరాన్ని ప్రాణం పోగానే ఎందుకు ముట్టుకోవడానికి కూడా భయపడతాం? కేవలం కొన్ని గంటల్లోనే అగ్నికి ఎందుకు ఆహుతి చేస్తాం? ఇదంతా కేవలం ఒక ఆచారం మాత్రమేనా అంటే కానే కాదు. గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన ఒక భయంకరమైన, కానీ పరమ సత్యమైన రహస్యం ఇది.

1 / 5
మనం చేసే అంత్యక్రియల వెనుక ఉన్న స్పిరిచువల్ సైన్స్ తెలిస్తే చావు గురించిన మన ఆలోచనే పూర్తిగా మారిపోతుంది. మరణం అనేది ముగింపు కాదు, ఒక మహా ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఒక ఇంట్లో మరణం సంభవించినప్పుడు బంధువుల రోదనలు, గుండెలు పగిలే ఏడుపులు ఉంటాయి. కానీ ఆ మృతదేహం పక్కనే ఆ శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. "నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఏడుస్తున్నారు?" అని అరుస్తుంది. కానీ ఆ అరుపు ఎవరికీ వినపడదు.

2 / 5
ఆ సమయంలో ఆత్మపడే వేదనను చూసి చలించిపోయిన పక్షిరాజు గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని అడిగాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఈ దేహం పంచభూతాల కలయక అని, ప్రాణం పోయాక ఇది కేవలం ఒక శవం మాత్రమేనని వివరించారు. భూమి మీద నుండి తీసుకున్న ఈ శరీరాన్ని మళ్ళీ ఈ ప్రకృతికి తిరిగి ఇచ్చేయడమే శవ సంస్కారం. ఒకవేళ శవాన్ని అలాగే ఉంచితే ఆత్మకు ఒక పెద్ద భ్రమ ఏర్పడుతుంది. "నా శరీరం ఇంకా అలాగే ఉంది కదా, నేను మళ్ళీ అందులోకి వెళ్ళిపోవచ్చు" అని ఆశపడుతుంది.

3 / 5
ఆ మోహంతో ఆ శవం చుట్టూ, ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకే దహన సంస్కారం చేస్తారు. తన కళ్ళ ముందే తన శరీరం కాలి బూడిద అయిపోవడం చూసిన ఆత్మకు ఒక నగ్న సత్యం అర్థమవుతుంది. తన భౌతిక ప్రయాణం ముగిసిందని రియలైజ్ అయ్యి, అప్పుడే అది తన తదుపరి లోకాల వైపు ప్రయాణం మొదలు పెడుతుంది.

4 / 5
ఒకవేళ ఎవరికైనా ఈ అంత్యక్రియలు జరగకపోతే ఆ ఆత్మకు పితృలోక ద్వారాలు తెరుచుకోవు. యమకింకరులు ఆ ఆత్మను ముందుకు తీసుకు వెళ్ళలేరు. ఆ ఆత్మ గాలిలో ఒక ప్రేతాత్మలా ఉండిపోయి తీవ్రమైన ఆకలి దప్పులతో ఎన్నో వందల ఏళ్ల పాటు ఈ భూమి మీదే నరకం అనుభవిస్తుంది. అందుకే ప్రతి మనిషికి అంత్యక్రియలు జరగడం దేవుడి ఇచ్చిన జన్మ హక్కు.

5 / 5
ఈ గరుడ పురాణ విషయాలను ఈనాటి మోడర్న్ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ప్రాణం పోయిన శరీరంలో క్షణాల్లో బ్యాక్టీరియా పెరిగిపోయి భయంకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి, అగ్నితో దహనం చేయడం వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. చివరికి మిగిలేది ఒక్క గుప్పెడు బూడిద మాత్రమే కాబట్టి, శరీరం నశ్వరం, ఆత్మ శాశ్వతం అనే సత్యాన్ని గ్రహించి ధర్మంగా బతకడమే మానవ జీవిత పరమార్థం.

Follow Us