కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశులవారు అపర కుబేరులు కాబోతున్నారు..!

Edited By:

Updated on: Jan 17, 2025 | 7:05 PM

Kubera Yoga: ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగనందువల్ల కొద్ది కాలంగా అవస్థలు పడుతున్న ఆరు రాశుల వారు ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడి ఈ నెల 28 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ సిరిసంపదలను అనుభవించబోతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి దాదాపు పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఈ నెల 28 నుంచి శుక్రుడు దాదాపు 75 రోజుల పాటు మీన రాశిలో ఉచ్ఛపట్టడంతో పాటు, వృషభ రాశిలో ఉన్న గురువుతో రాశి పరివర్తన చెందడం వల్ల ఈ ఆరు రాశుల వారికి అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. ఈ ఆరు రాశులుః వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.

1 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు గురువుతో పరివర్తన చెందినందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు తప్పకుండా కలుగుతాయి. జీతభత్యాలు, ఆదాయం బాగా వృద్ధి చెందు తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. సామాజికంగా కూడా హోదా, స్థితిగతులు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. నిరు ద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. అనారోగ్యాల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి కలుగుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రెండు శుభ గ్రహాల మధ్య పరివర్తన ఈ రాశివారికి అనేక శుభ ఫలితాలనిస్తుంది. అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది.

3 / 6
కన్య: గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం కన్యారాశి వారికి చాలా మంచిది. ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా అరుదైన అవకాశాలు లభిస్తాయి. నిజ ఆదాయం పెరగడంతో పాటు అదనపు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని ధన యోగాలు కలుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో రాజ యోగాలు కలుగుతాయి. అనేక ప్రయత్నాలు, వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆత్మ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశివారికి తృతీయ, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల మట్టి కూడా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే అవకాశం ఉంది. ప్రయాణాలు, ప్రయాణ సంబంధ మైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఆదాయం బాగా పెరుగుతుంది. అధిక వేతనంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి మీద ప్రేమ పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

6 / 6
కుంభం: ఈ రాశివారు ఈ శుభ గ్రహాల పరివర్తన వల్ల ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం, మానసిక పరిస్థితి బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్లు అందుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.