
అయితే శుక్రవారం రోజున అస్సలే పుల్లటి ఆహారాలు తినకూడదు అని చెబుతారు పండితులు. ఈరోజు ఎవరు అయితే పుల్లటి ఆహారం తినకుండా ఉంటూ, లక్ష్మీదేవికి ఉపవాసం ఉంటారో, వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుందంట. కాగా, శుక్ర వారం రోజున పుల్లటి ఆహారాలు ఎందుకు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

శుక్ర వారం రోజున చింత పండు, నిమ్మకాయ, వెనిగర్ లేదా ఊరగాయల లాంటి పుల్లటి పదార్థాలు తినకూడదంట. ఇవి తినడం వలన సంతోషిమాత, లక్ష్మీదేవి అగౌరవ పరిచినట్లు అంటారు. అంతే కాకండా ఎవరు అయితే దీనిని తింటారో, అందుకే కొంత మంది ఈ రోజు పుల్లటి ఆహారాన్ని తినకుండా ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు.

ఇక శుక్ర వారం రోజు ఉపవాసం పాటించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ఈరోజున ఉపవాసం ఉండటం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయంట. అందువలన ఎవరు అయితే తమ ఇంటిలో సంపద, శ్రేయస్సు పెరగాలని కోరుకుంటారో, వారు శుక్రవారం ఉపవాసం ఉండటం చాలా మంచిదంట. అంతే కాకుండా ఈ రోజు దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో నీటిని నింపి, విష్ణు మూర్తికి అభిషేకం చేసి, పుల్లటి ఆహారాలు తినకుండా ఉండటం వలన ఆ ఇంటిలో అష్టైశ్వార్యాలు కలుగుతాయంట.

అదే విధంగా శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం వలన ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలిగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. అదే విధంగా ఈ రోజున ఎనిమిది రకాల లక్ష్మీదేవిని పూజించడం ద్వారా, అమ్మవారిని ఎనిమిది దైవిక వ్యక్తీకరణలతో పూజించడం వలన విజయం, అదృష్టం, ఆరోగ్యం, లభిస్తాయంట. అమ్మవారి ఎనిమిది రూపాలు ఏవి అంటే. ధన లక్ష్మీ, గజ లక్ష్మీ, ఆది లక్ష్మీ, విజయ లక్ష్మీ, ఐశ్వర్య లక్ష్మీ, వీర లక్ష్మీ, ధాన్య లక్ష్మీ, సంతాన లక్ష్మీ.

ఎవరు అయితే లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలిని కోరుకుంటారో , వారు పెళ్లికాని అమ్మాయిలను తమ ఇంటికి ఆహ్వానించి, వారికి స్వీట్‌తో కలిపి ఆహారం వడ్డించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంట. అలాగే సాయంత్రం సమయంలో ఇంటికి ఈశాన్య దిశలో ఎర్రటి కాటన్ వత్తి, చిటికెడు కుంకుమ పువ్వుతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన సానుకూల ఫలితాలు కలుగుతాయంట.