
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రారాశులను మార్చుకుంటూ కాలానుగుణంగా ప్రత్యక్షంగా లేదా తిరోగమన కదలికలలో కదులుతాయి. దీని ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై కనిపిస్తుంది. ఈ ఏడాది దీపావళి పండగ రోజున నవ గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు తిరోగమనంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శానీశ్వరుడిని న్యాయమూర్తి, కర్మ ఫలదాత అని అంటారు. ఈనేపధ్యంలో అక్టోబర్ 20న దీపావళి రోజున శనిదేవుడు తిరోగమనంలో మీన రాశిలో సంచరిస్తాడు.

ఈ ఏడాది దీపావళి రోజున శని తిరోగమనంలో ఉండటం వల్ల కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. వీరు అపార సంపదను పొందుతారు. దీపావళి నాడు శని తిరోగమనంలో ఉండటం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

మిథున రాశి: మిథున రాశి వారికి శని తిరోగమనం చాలా శుభప్రదంగా , అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు మిథున రాశిలో, కర్మ గృహంలో తిరోగమనం చెందాడు. అందువల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్ , వ్యాపారంలో గణనీయమైన పురోగతిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం ఉంది. వీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశికి చెందిన వారికి శని తిరోగమనం చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో సంపద , వాక్కులకు నిలయం అయిన స్థానంలో శని తిరోగమనంలో ఉన్నాడు. దీంతో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి గణనీయమైన మెరుగుదలలో ఉంటుంది. తమ మాటల ద్వారా ప్రజలను గణనీయంగా ప్రభావితం చేయగలరు. వీరిలో ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

మకర రాశి: మకర రాశి వారికి శని తిరోగమనం సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ రాశిలోని మూడవ ఇంట్లో శని తిరోగమనంలో ఉన్నాడు. ఇది వీరి వృత్తి, వ్యాపారానికి గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది. ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి సులభంగా అవకాశాలను తెస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో ఇబ్బందులు తీరతాయి. వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది.