
జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు న్యాయ దేవుడు, కర్మ ప్రదాత అని పిలుస్తారు. అతను వ్యక్తి కర్మానుసారంగా ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే అతని సంచారము లేదా కదలికలో మార్పు ప్రతి రాశివారి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. శనీశ్వరుడు అనుగ్రహం కలిగితే పేదవాడు సైతం రాజుగా మారిపోతాడు. అదే సమయంలో శనీశ్వరుడికి కోపం వస్తే.. రాజును కూడా పేదవాడిగా మార్చగలడని చెబుతారు.

ఈ సంవత్సరం దీపావళికి ముందు ఒక పెద్ద మార్పు జరగబోతోందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అక్టోబర్ 3, 2025న శనిగ్రహ గమనంలో మార్పు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. శనీశ్వరుడు ఆశీస్సులతో ఈ రాశి వారు జీవితంలోని అనేక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే వృషభ, మిథున, మకర రాశి వారి అదృష్టం ఈ సమయంలో ప్రకాశిస్తుంది. ఈ మూడు రాశులపై శనిశ్వర గమనం వలన ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఈ 3 రాశుల వారికి శని సంచారము అదృష్టాన్ని ప్రసాదిస్తుంది.

వృషభ రాశ: శని దేవుని గమనంలో మార్పు కారణంగా వృషభ రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నావారికి పురోగతి ఉంటుంది. డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. వీరు పెట్టుబడి నుంచి లాభాలను పొందుతారు.

మిథున రాశి: మిథున రాశి వారికి శని సంచారం అదృష్టాన్ని తెస్తుంది. అదృష్టం వీరి సొంతం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయం సాధిస్తారు. విద్య , వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే బలమైన అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది . గౌరవం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి: మకర రాశి వారికి శనిదేవుడు ప్రత్యేక ఆశీస్సులు అందించబోతున్నాడు. ఈ సమయం ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంక్షోభం తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల అవకాశం ఉంది. దీనితో పాటు కుటుంబ జీవితంలో కూడా శాంతి, ఆనందం అనుభవమవుతాయి.