Nipuna Yoga: శనీశ్వరుడితో బుధుడు యుతి.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు..!

| Edited By: Janardhan Veluru

Jan 16, 2025 | 6:37 PM

ఫిబ్రవరి 12 నుంచి 27వ తేదీ వరకు బుధుడు కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. అక్కడ శనీశ్వరుడితో బుధుడు యుతి చెందడం వల్ల అత్యంత అరుదైన ‘నిపుణ యోగం’ ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని, బుధులు ఏ రాశిలో కలిసినా నిపుణ యోగం ఏర్పడి, కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రజ్ఞలు, ప్రతిభలు, నైపుణ్యాలు కలిగి, అందలాలు ఎక్కడం జరుగు తుంది. కుంభ రాశిలో చోటు చేసుకుంటున్న ఈ నిపుణ యోగం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి విశేషంగా లాభాలు కలిగే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ నిపుణ యోగం చోటు చేసుకోవడం అత్యంత శుభదాయకం. ఉద్యోగంలో మీ ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. తప్పకుండా ఉన్నత పదవులు వరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అసాధారణ విజయాలు సాధిస్తాయి. ఉద్యోగులకు మరింత మంచి ఉద్యోగాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి కూడా అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

2 / 6
వృషభం: ఈ రాశికి శని, బుధ గ్రహాలు రెండూ అత్యంత శుభులు. ఇవి రెండూ దశమ స్థానంలో కలవడం వల్ల కెరీర్ పరంగా విశేషమైన పురోగతి ఉంటుంది. ప్రతిభ, సమర్థతలతో అనేక విధాలుగా వృత్తి, ఉద్యోగాల్లో రాణించడం జరుగుతుంది. బుధుడు వ్యాపార కారకుడైనందువల్ల వ్యాపారాల్లో కూడా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధించడంతో పాటు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది.

3 / 6
మిథునం: రాశినాథుడైన బుధుడు భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శనితో కలిసినందువల్ల ప్రత్యేకమైన నిపుణ యోగం కలుగుతుంది. వాక్చాతుర్యం బాగా వృద్ధి చెందుతుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా రాణిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి అరుదైన ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయమవు తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ధన యోగాలు పడతాయి.

4 / 6

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ నిపుణ యోగం ఏర్పడుతున్నందువల్ల మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. అనేక విధాలుగా నైపుణ్యాలు, ప్రతిభాపాటవాలు వృద్ధి చెందడంతో పాటు, ధన లక్ష్మీ యోగాలు, రాజయోగాలు కూడా కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపి స్తాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలగడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుం టారు. ప్రతి రంగంలోనూ విజయాలు అందుకుంటారు. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది.

5 / 6
మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ఈ నిపుణ యోగం కలిగినందువల్ల అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకుంటారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, ఆర్థిక లాభాలు పొందు తారు. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాఫారాల్లో ధన ప్రవాహానికి అవకాశం ఉంది. సుమారు పదిహేను రోజుల పాటు రాజ భోగాలు అనుభవిస్తారు. మీ సమర్థతకు, ప్రతిభకు, నైపుణ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

6 / 6
కుంభం: ఈ రాశిలో శని, బుధులు కలిసి నిపుణ యోగం ఏర్పడుతున్నందువల్ల అనేక రకాలైన పోటీలను తట్టుకుని తమ ప్రతిభా పాటవాలతో తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఏ విధంగా కష్టపడినా అందుకు రెట్టింపు ఫలితాన్ని అందుకుంటారు. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నవారికైనా విజయాలు లభిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే సూచనలున్నాయి.