వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు లాభ స్థాన ప్రవేశంతో వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా శీఘ్ర పురోగతి ప్రారంభమవుతుంది. ఇంత వరకూ పెండింగులో ఉండిపోయిన పదోన్నతులు ఇప్పుడు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ యాక్టివిటీ బాగా వృద్ధి చెందు తుంది. రాబడి అంచనాలను మించుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది.
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో శని ప్రవేశం వల్ల ఉద్యోగంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి పదోన్నతితో పాటు మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి జీవితంలో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ పెరుగుతుంది. ఇష్ట మైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం అంచనాల్ని మించుతుంది.
కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరగడంతో పాటు, అధికార యోగం పట్టే అవకాశం ఉంది. జీతభత్యాలు, అదనపు ఆదాయం అంచనాలకు మించి పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు స్థిరపడతారు.
కన్య: ఈ రాశికి శనీశ్వరుడు సప్తమ స్థానంలో సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. వీరి సమర్థతకు, పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. రాజకీయాలు, ప్రభుత్వంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అపార ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లోనూ, షేర్లు, బాండ్లలోనూ మదుపు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి రాబడి వృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి డిమాండ్ పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి భారీగా ఆఫర్లు అందే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడం జరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరగడంతో పాటు కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది.