Peddamma Temple: 3 రోజుల పాటు పెద్దమ్మ తల్లి శాకాంబరి ఉత్సవాలు.. కూరగాయలు, పండ్లతో అలంకరణ.. పోటెత్తిన భక్తులు..

|

Jul 06, 2022 | 5:52 PM

Peddamma Temple: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజులపాటు కొనసాగే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వివిధ కూరగాయలతో అలంకరించారు.

1 / 5
బుధవారం నుంచి శుక్రవారం వరకు శాకంబరి ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకంతో పాటు ప్రతిష్టాపన మండపం, దేవతా పూజలు, మంత్రపుష్పం నిర్వహించారు. నిత్య అభిషేకం, అర్చన, మంత్రపుష్ప కార్యక్రమం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

2 / 5
బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో  తరలి వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శింకుంటున్నారు.

3 / 5
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయ ఫౌండర్ ట్రస్ట్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అభిషేకంతో పాటు అమ్మవారికి హారతి, అర్చన కార్యక్రమం ఉంటుందని చంద్రమౌళి శర్మ తెలిపారు.

4 / 5
ఈ ఉత్సవాల కోసం ఆలయాన్ని 20 క్వింటాళ్ల పండ్లు, కూరగాయలతో అలంకరించారు. చివరి రోజు గుడికి వచ్చే భక్తులకు అలంకరణ చేసిన పండ్లు, కూరగాయలు పంచుతామని తెలిపారు. 8వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

5 / 5
 ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు