
రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నేపథ్యంలో పిల్లలని పెద్దలను ఆకర్షించే విధంగా సుందరీకరణ చేయనున్నారు.

రామప్ప ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులతో పాటు పిల్లలు ఆహ్లాదంగా గడిపేందుకు స్పెషల్ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్ లో పిల్లల కోసం సౌకర్యాలను కల్పించనున్నారని తెలుస్తోంది.

కాకతీయుల కాలంలో ఎక్కువగా నిర్మించబడినవి శివాలయాలే.. గణపతిదేవు చక్రవర్తి కి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న భక్తితో 1213లో నిర్మించిన ఆలయం రామప్ప ఆలయం. ఈ శిల్పిగా రామప్ప ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. సుమారు 40 ఏళ్ళు పట్టింది.. ఆలయానికి రామప్ప ఆలయంగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఆలయ పరిసర ప్రాంతాలను ప్రకృతి అందాలతో తీర్చిదిద్దనున్నారు.

రామప్ప ఆలయాన్ని సుందరీకరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చేపట్టనున్నారు. పచ్చదనముతో కూడిన చెట్లను ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పటు చేయనున్నారు.

ఆలయాన్ని వచ్చే భక్తులతో పాటు... కట్టడాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలను కల్పించనున్నారు. ప్రకృతి ఎంజాయ్ చేస్తూ.. ఆహారం తినడానికి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

రామప్ప ఆలయానికి అడుగు పెట్టడానికి ముందే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఒక పెద్ద శివుని విగ్రహాన్ని .. అందమైన పువ్వులతో ఉన్న మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు రామప్ప బ్యూటిఫికేషన్ మోడల్స్ పోటోలను రిలీజ్ చేశారు.