
భారత దేశంలో పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది ఫేవరెట్ . అయితే ఎప్పుడూ దీని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఇది ఫేమస్ రిసిపీలో ఒక్కటి. ఇక దీని గురించి అడుగుతే అనేక సమాధానాలు చెప్పుకొస్తుంటారు. అయితే ఈ రుచికరమైన వంటకం మహాభారతంలోని పాంచాల యువరాణి ద్రౌపదికి సంబంధించినదంట. దాని గురించి తెలుసుకుందాం.

అయితే కొంత మంది చెప్పిన కథనం ప్రకారం, పాండవులు వనవాసం సమయంలో ద్రౌపదికి కొత్తగా వివాహం జరిగింది. అయితే అప్పుడు కుంతి దేవి అయిన అత్తగారు, తన కోడలు ద్రౌపది తెలివి తేటలను పరీక్షించాలి అనుకుంటారు. దీంతో బంగాళాదుంప, చిన్న చపాతికి సరిపడ గోధుమ పిండి ఇచ్చింది. అయితే వీటితోనే తన ఐదుగురు కొడుకుల ఆకలి తీర్చాలని చెప్పుకొచ్చింది.

దీంతో ద్రౌపది చాలా తెలివైనది. ఆమె పిండి ముద్దను, బంగాళదుంపను ఉన్నవి ఉన్నట్లుగా వడ్డించకుండా, ఆ చిన్న పిండి ముద్దను చిన్న చిన్న భాగాలుగా చేసి, ప్రతి భాగాన్ని చిన్న చిన్న పానీ పూరిలా చేసింది . వాటిలో బంగాళదుంప మిశ్రమం నింపింది. ఇలా కేవలం ఒక ముద్దతో ఐదుగురు రాకుమారుల కడుపు నింపింది.

ఇక తన కోడలి సృజనాత్మకతకు ఫిదా అయిపోయిన కుంతి దేవి, ఆ వంటకానికి అమరత్వాన్ని ప్రసాదించిదంట. అందుకే వేల సంవత్సరాలు గడిచినా పానీ పూరి ప్రతి ఒక్కరికీ ఇష్టంగానే తింటారంట. అందుకే ఇది చాలా అద్భుతంగా, రుచికరంగా ఉంటుందట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు