October Horoscope 2023: వారి జీవితాల్లో సానుకూల మార్పులు పక్కా.. 12 రాశుల వారికి అక్టోబర్ మాసఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

Sep 30, 2023 | 6:22 PM

మాస ఫలాలు (అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు): మేష రాశి వారికి అక్టోబర్ నెలలో కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరీ ముఖ్యంగా అక్టోబర్ 24 తేదీ నుంచి తప్పకుండా జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. వృషభ రాశి వారికి చాలాకాలంగా ఇబ్బందిపెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు అక్టోబర్ మాసంలో మాసఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

1 / 13
మాస ఫలాలు (అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు): మేష రాశి వారికి అక్టోబర్ నెలలో కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరీ ముఖ్యంగా అక్టోబర్ 24 తేదీ నుంచి తప్పకుండా జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. వృషభ రాశి వారికి చాలాకాలంగా ఇబ్బందిపెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారు గత కొంత కాలంగా కొన్ని శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవిస్తున్న ఈ రాశివారు ఈ నెల చివరి వారం నుంచి మరింత ఉత్తమ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు అక్టోబర్ మాసంలో మాసఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోం

2 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలలో బుధ, శుక్ర, రవి, రాహువు, కేతు గ్రహాల మార్పు వల్ల కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 24న రాశి నుంచి రాహువు మీన రాశిలోకి మారడం అనేది జీవిత క్రమంలో తప్పకుండా సానుకూల మార్పులు తీసుకు వస్తుంది. కొన్ని రకాల ఒత్తిళ్లు, ఉద్రిక్తతలు తగ్గి, మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగపరంగానూ, ఆర్థికంగానూ ఆశించిన స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సూచనలున్నప్పటికీ మొత్తం మీద నెలంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు మరింతగా రాణిస్తాయి. వ్యాపా రాల్లో లాభాలకు లోటుండదు. మీ ఆలోచనలకు, మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆదరణ లభి స్తుంది. ఉద్యోగులు వ్యాపారాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి.  కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులుం టాయి. విద్యార్థులు సునాయాసంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

3 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ నెల మొదటి వారంలో రాశులు మారుతున్న శుక్ర, బుధ గ్రహాల వల్ల అనేక సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి అనుకోకుండా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నెల మధ్యలో కన్యారాశి నుంచి రవి తులా రాశిలోకి మారడం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నెల చివరి వారంలో రాహువు లాభస్థానంలోకి మారడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ప్రమోషన్లకు, జీతభత్యాలు అంచనాలకు మించి పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సమ స్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడినా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

4 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గత కొంత కాలంగా కొన్ని శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవిస్తున్న ఈ రాశివారు ఈ నెల చివరి వారం నుంచి మరింత ఉత్తమ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. లాభ స్థానంలో సంచరిస్తున్న గురువును రాహువు ఈ నెల 24వ వదిలి పెడుతుండడంతో ‘గురు చండాల యోగం’ తొలగిపోయి, గురువు పూర్తి స్థాయిలో శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల మొదట్లో ఈ రాశినాథుడు బుధువు ఉచ్ఛ స్థితికి వస్తూండడం వల్ల ఈ రాశివారి జీవితంలో తప్ప కుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకునే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. మొండి వ్యాధుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలున్నాయి. విదేశీయాన యోగం  పడుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.

5 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అక్టోబర్ 2వ తేదీ నుంచి పదిహేను రోజుల పాటు ఈ రాశిలో శుక్ర గ్రహం, ధన స్థానంలో కుజ, బుధ, రవులు సంచారం చేయడం వల్ల అనేక మార్గాలలో ఆదాయం గడించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి, రుణాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కుట్రలు, కుతంత్రాల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలున్నాయి. ఇష్టమైన వారితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరినీ అంత త్వరగా, అంత తేలికగా నమ్మకపోవడం మంచిది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.

6 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో శుక్రుడు తన సంచారాన్ని ప్రారంభించడం, ఈ రాశ్యధిపతి రవి ధనస్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడితో కలిసి ఉండడం, సింహరాశి మీద గురువు దృష్టి ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా శుభప్రదంగా, సుఖప్రదంగా సాగిపోతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ నెల 17 తర్వాత రవి గ్రహం నీచపడుతు న్నందువల్ల కొద్దిగా అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవ కాశం కూడా ఉంది. ఈ నెల 24 తర్వాత రాహువు గురు గ్రహాన్ని వదిలిపెడుతున్నందువల్ల జీవి తంలో కొన్ని ముఖ్యమైన శుభ  పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగా లలో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం మారడా నికి చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు, విదేశీ అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్ర మించే అవకాశం ఉంది. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

7 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అక్టోబర్ 2 నుంచి ఈ రాశిలో రాశినాథుడు బుధుడు ప్రవేశిస్తున్నందువల్ల, రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగడం, స్వయంగా ఉన్నత స్థితికి చేరుకోవడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఇప్పటికే ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి సాధించడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. అయితే, రాశిలో ఉన్న కుజుడు, అష్టమ స్థానంలో ఉన్న గురువు కారణంగా తరచూ అనా రోగ్య బాధలు, అనవసర వ్యయాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాస లతో గానీ పూర్తయ్యే అవకాశం ఉండదు. అనవసర పరిచయాల మీద భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. స్నేహితుల వల్ల కూడా కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం లేదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించకపోవచ్చు.

8 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెల రెండవ తేదీన లాభస్థానంలో రాశ్యధిపతి ప్రవేశించడంతో ఈ రాశివారికి అనేక అంశాలలో, ప్రయత్నాలలో విజయాలు లభించడం ప్రారంభం అవుతుంది. విపరీత రాజయోగం పట్టబోతోంది. అనేక రంగాల వారికి అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల 24 నుంచి ఈ రాశివారికి రాశికి పట్టిన రాహు, కేతువుల బాధ కూడా తగ్గిపోతుంది. మొత్తం మీద ఈ నెలంతా వైభవంగానే సాగిపోయే అవకాశం ఉంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయితే, అనవసర పరిచయాలకు, వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్నేహితులతో కలిసి విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.

9 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ నెల మొదటి వారంలో శుక్ర, బుధ గ్రహాలు దశమ, లాభస్థానాల్లో ప్రవేశించడం, లాభస్థానంలో బుధుడు ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అధికారుల నుంచి తప్పకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. అయితే, ఈ నెల 17న ఉద్యోగ స్థానాధిపతి రవి నీచపడు తున్నందువల్ల ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గవచ్చు. ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం లేదు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చవద్దు. అవమానాలకు గురయ్యే అవకాశముంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అసంతృప్తి కలిగిస్తాయి.

10 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశివారికి ఈ నెలంతా ప్రధాన గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం వల్ల, ముఖ్యంగా ఉద్యోగ స్థానం పటిష్టంగా, శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం గానీ, మరే దైనా సంస్థకు అధిపతి కావడం గానీ జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. ఎక్కువగా శుభ వార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం తప్పకుండా ఒక సానుకూల మలుపు తిరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు నచ్చిన సంస్థలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. సతీమణికి సామాజికంగా ప్రాధాన్యం పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

11 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో ధనాధిపతి శని, భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడు బలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా ఆర్థికంగా, కుటుంబపరంగా బాగా ఉన్నతంగా సాగిపోతుంది. ఆదాయ మార్గాలు పెరగడం, జీతభత్యాలు దాదాపు రెట్టింపు కావడం, ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావా దేవీలు విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. జీవన కారకుడైన శనీశ్వరుడు స్వక్షేత్రంలో శక్తిమం తుడై ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరు ద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవు తాయి. ఈ నెల చివరి వారంలో రాహువు తృతీయ స్థానంలోకి మారడం వల్ల ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసమేతంగా విహార యాత్రలు చేసే సూచనలున్నాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.

12 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ నెల 2వ తేదీ నుంచి శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం ప్రారంభించడం, అష్టమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వంటి పరిణామాల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోవడం జరుగుతుంది. సతీమణితో సఖ్యత, సయోధ్య ఏర్పడతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదాలు చికాకు పెడతాయి. తల్లితండ్రు లతో అపార్థాలు తలెత్తుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఈ నెల చివరి వారంలో రాహువు కుటుంబ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న చిరాకులు తలెత్తే అవకాశం ఉంది. మాటలు, చేతల విషయంలో తొందరపాటు పనికి రాదు. ముఖ్యమైన వ్యవహా రా లను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్ప డుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా సాగకపోవచ్చు.

13 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ నెల మొదటి వారంలో సప్తమంలో బుధుడు ఉచ్ఛ పట్టడం, అక్కడ బుధాదిత్య యోగం కూడా ఏర్పడడం వల్ల జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోవడానికి అవకాశం కలిగింది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారాలను పంచుకునే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాములతో, కుటుంబంలో సతీమణితో విభేదాలు సమసిపోతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దాయాదులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.