November Festival Calendar: ఈ నెలల్లో వచ్చే ముఖ్యమైన పండగ వివరాలు.. విశిష్టత

|

Oct 31, 2021 | 2:03 PM

November Festival Calendar: నవంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం ఇక హిందూ క్యాలెండర్ లో కార్తీక మాసం నవంబర్ లో వచ్చింది. దీంతో ఈ నెలలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన దీపావళి, అన్నాచెల్లెళ్ల పండగ, నాగుల చవితి వంటి అనేక పండగలు వస్తాయి. ఈరోజు నవంబర్ నెలలో వచ్చే పండగలు ఏమిటి.. ఏఏ తేదీల్లో పండగలు వచ్చాయో తెలుసుకుందాం..

1 / 9
హిందూ సంప్రదాయంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపధ్యంలో కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రామ ఏకాదశి అంటారు. నవంబర్ 1న  రామ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాతుర్మాస కాలం ముగుస్తుంది. నవంబర్ 14న దేవుని ఏకాదశి, నవంబర్ 30న ఉత్పన్న ఏకాదశిని జరుపుకోనున్నారు.

2 / 9
నవంబర్ రెండో తేదీన ధన త్రయోదశి వచ్చింది. దీన్నే దంతేరాస్ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి మరియు కుభేరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  క్షీరసాగర మథనం సమయంలో ఈరోజున లక్ష్మీదేవి జన్మించిందని పురాణాల కథనం

3 / 9
నవంబర్ మూడో తేదీ..నరక చతుర్దశి. క్రిష్ణ పక్షంలో చతుర్దశి రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఇది దీపావళికి ముందు రోజున వస్తుంది

4 / 9
 నవంబర్ 4వ తేదీన గురువారం నాడు దీపావళిను జరునుకుంటారు. కార్తీక మాసంలో దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున భక్తులు లక్ష్మీ పూజను నిర్వహిస్తారు.

5 / 9
నవంబర్ 5 ఈ రోజున  ఇంద్ర దేవుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా గోవర్ధన్ పూజను భక్తులు జరుపుకుంటారు.

6 / 9
నవంబర్ 6న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ఇది రక్షా బంధన్ వంటి పండగ. అన్న చెల్లలు జరుపుకునే పండగ. సోదరీమణులు తమ సోదరుల శ్రేయస్సు కోసం వారి నుదిటిపై తిలకం పెట్టుకుని ప్రార్థిస్తారు. ఈ పండుగను ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు.

7 / 9
నవంబర్ 15న భక్తులు పవిత్రమైన తులసి మొక్క యొక్క వివాహ వేడుకను నిర్వహిస్తారు. ఈ తులసి వివాహం తర్వాత, భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది.

8 / 9
నవంబర్ 19న, కార్తీక పౌర్ణమి.. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గురునానక్ దేవ్ జీ కూడా ఈ రోజే.

9 / 9
నవంబర్ 30 తేదీన ఉత్పన్న ఏకాదశి వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి తిథి నాడు ఏకాదశి  వస్తుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.