Mahadev Mandir: ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఇక్కడ లింగాన్ని తెల్లవారు జామునే విభీషణుడు పూజిస్తారట…

|

Jul 24, 2021 | 8:57 PM

Mahadev Temple: భారత దేశం ఆధ్యాత్మకతకు ఆలయం.. మనదేశంలో ఎన్ని వింతలు అద్భుతాలు , సైన్సు కూడా ఛేదించలేని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని భగవంతుడి లీలను భక్తుల నమ్మకం. అటువంటి ఒక ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో ఉంది. ఇక్కడ ఆలయంలో తలుపులుతెరచే సమయానికి లింగానికి ఎవరో పూజలు చేసిన ఆనవాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

1 / 6
మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో దట్టమైన అరణ్య ప్రాంతంలో పకృతి అందాల నడుమ ఎత్తైన కొండపై ఉన్న ఈశ్వర మహాదేవ్ ఆలయంలో ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో రోజూ ఓ వింత జరుగుతుంది. పూజారి వేకువ జామున ఆలయ గర్భగుడి తలుపులు తీసే సమయానికి ఎవరో స్వామివారిని పుష్పాలు, బిల్వదళాలతో పూజించి వెళ్లిపోయిన ఆనవాలు కనిపిస్తాయి.

2 / 6
లింగ స్వరూపుడైన స్వామివారిని ఎవరు వచ్చి స్వామివారికి పూజిస్తున్నారు అనేది ఎవరికీ అంతుబట్టదు. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. పూజ చేసి వెళ్లినట్లు స్పష్టమైన ఆధారం కనబడుతుంటుంది.

3 / 6
తెల్లవారు జామున 4 గంటలకు ఓ సిద్ధ యోగి స్వామివారిని పూజిస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. అయితే అలా పూజ చేస్తున్న స్వామి ఎవరనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.

4 / 6
ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ఏడాది పొడవునా 365 రోజులు సహజ సిద్ధంగా శివలింగంపైన నీరు పడుతూనే ఉంటుంది.

5 / 6
ఇక్కడ శివలింగాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడు ప్రతిష్టించారని పురాణాల కథనం శివలింగాన్ని ప్రతిష్టించిన విభీషణుడు రోజూ వచ్చి శివుడి పూజార్చన చేస్తున్నారని అక్కడి స్థానికుల నమ్మకం.

6 / 6
రాందాస్ జీ మహారాజ్ అనే సన్యాసి గతంలో ఇక్కడ తపస్సు చేశారనీ, అయితే ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ అదృశ్య రూపంలో  రోజూ లింగానికి పూజలు చేస్తున్నారని మరో కథనం