
వృషభం: ఈ రాశులకు శని, చంద్రులు లాభ స్థానంలో కలవడం వల్ల ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఈ రాశివారిలో ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. 23-25 తేదీల మధ్య ఈ రాశివారు ఆధ్యాత్మిక సాధన చేపట్టడం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి విదేశీ ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు ఆ మూడు రోజుల్లో చేపట్టే ఉద్యోగ ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా విజయవంతం అవుతాయి.

కర్కాటకం: రాశినాథుడు చంద్రుడు భాగ్యస్థానంలో శనితో కలవడం వల్ల ఈ రాశివారిలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధనలు, యోగ సాధనలు చేపట్టడం మంచిది. తీర్థయాత్రలకు, ఆలయాల సందర్శనకు సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి, ఉద్యోగంలో చేరడానికి ఇవి చాలా మంచి రోజులు. ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని, చంద్రుల కలయిక వల్ల ఈ రాశివారు పట్టిన పట్టు విడిచి పట్టడం జరగదు. అనుకున్నది సాధిస్తారు. వీరు కొద్ది ప్రయత్నంతో ఆధ్యాత్మికంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు, పుణ్య క్షేత్రాల సందర్శనకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదన యోగం పడుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శని, చంద్రుల కలయిక వల్ల ఏ విషయంలోనైనా వీరికి పట్టుదల పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో మొండి ధైర్యంతో వ్యవహరిస్తారు. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. సొంత ఊర్లో ఉద్యోగం లభించడానికి అవకాశం ఉన్నప్పటికీ, విదేశీ ప్రయత్నాల వల్ల కూడా లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో మంచి విదేశీ సంబంధం కుదురుతుంది.

మకరం: రాశ్యధిపతి శనితో తృతీయ స్థానంలో సప్తమాధిపతి చంద్రుడు కలవడం వల్ల ఈ రాశివారు ఉద్యోగం కోసమైనా, పెళ్లి కోసమైనా విదేశాల మీదే ఆధారపడడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వీరికి తప్పకుండా విదేశీయాన యోగం కలుగుతుంది. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆధ్యాత్మిక సాధనలో బాగా పురోగతి చెందుతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది.

మీనం: ఈ రాశిలో శని, చంద్రుల కలయిక వల్ల ఈ రాశివారిలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి ఆధ్యాత్మిక సాధన ప్రారంభించినా వీరు ఆ రంగంలో బాగా పురోగతి చెందడం, లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరత్వం పొందుతారు. వీరికి విదేశీ ప్రయత్నాలు తప్పకుండా లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాలే లభించే అవకాశం కూడా కనిపిస్తోంది.