ఈ నెల (ఆగస్టు) 3,4 తేదీల్లో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశించి, అక్కడే ఉన్న శనీశ్వరుడిని కలుసుకోబోతున్నాడు. సాధారణంగా శనీశ్వరుడి ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో శని, చంద్రులు కలుసుకోవడం వల్ల ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండడానికి అవకాశం ఇస్తుంది. జాతక చక్రంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నవాళ్లు సాధారణంగా ‘కూల్’గా ఉండడం జరుగుతుంది. పక్కనే బాంబు విస్ఫోటనం జరిగినా పట్టించుకోరు. అయితే, కుంభరాశిలో రెండు రోజులపాటు శనీశ్వరుడితో కలిసి ఉండే చంద్రుడి మీద సప్తమ స్థానమైన సింహరాశిలో సంచరిస్తున్న కుజ, బుధ, శుక్ర గ్రహాల దృష్టి పడుతుంది. మొత్తం మీద నాలుగు గ్రహాల ప్రభావం చంద్రుడి మీద పడుతున్నందువల్ల వివిధ రాశుల వారి జీవితాల్లో ఆర్థికంగా మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం, స్థిరత్వాలు ఏర్పడడం జరుగుతుంది.