
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, శుక్రులు కలవడం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగుల నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో ధనాధిపతి బుధుడితో కలవడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తగ్గిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు తన మిత్ర గ్రహమైన శుక్రుడిని పంచమ స్థానంలో కలుసుకోవడం వల్ల ఈ రాశివారికి లక్ష్మీయోగం పడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అత్యంత ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడితో కలవడం ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడంతో పాటు లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభి స్తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశిలో ఈ రాశికి అత్యంత శుభులైన బుధ, శుక్రుల కలయిక వల్ల అరుదైన ధర్మకర్మాధిప యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం జరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆర్థికంగా బాగా ఎదిగే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, బుధుల కలయిక వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అనేక శుభవార్తలు వింటారు. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.