వివాహ బంధానికి సంబంధించినంత వరకూ జ్యోతిష శాస్త్రంలో ఆరు రాశుల వారికి ఒక విశిష్ట స్థానం ఉంది. అవిః వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం. ఈ రాశులకు సంబంధించిన సంబంధాలు వచ్చినప్పుడు కళ్లు మూసుకుని వీరితో పెళ్లి చేయవచ్చని జ్యోతిష పండితులు చెబుతుంటారు. ఈ రాశులవారు సాధారణంగా వివాహ బంధానికి, కుటుంబ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. ‘తెగే దాకా లాగితే తప్ప’ వీరు విడాకులకు, విడిపోవడాలకు అవకాశం ఇవ్వరు. ఇందులో కూడా వృషభ, కర్కాటక, మకర రాశులవారు ఎంతో ఒద్దికగా, ఓర్పు సహనాలతో కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం, కుటుంబానికి, జీవిత భాగస్వామికి అంటి పెట్టుకుని ఉండడం జరుగుతుంటుంది. విచిత్రమేమిటంటే, పాశ్చాత్య జ్యోతిష్యులు, సౌరమానాన్ని అనుసరించేవారు కూడా వివాహ బంధం విషయంలో ఈ రాశులకే ప్రాధాన్యం ఇస్తుంటారు.