
మార్చి 16న చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, మార్చి 18 వరకు అక్కడే ఉంటాడు. అలాగే కుజుడు, రాహువు కూడా ప్రస్తుతం కుంభ రాశిలోనే సంచరిస్తుంది. ఈ క్రమంలో త్రిగ్రాహి రాజయోగం , మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దీంతో నాలుగు రాశుల వారికి సంపద పెరుగుతుంది. ఇంతకీ ఆ రావులు ఏవి అంటే?

తుల రాశి : మహాలక్ష్మీ రాజయోగం వలన ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. అనుకున్న పనులన్నీ సవ్యంగా, చాలా త్వరగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు తగ్గుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాల కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది.

కుంభ రాశి : కుంభరాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరతాయి. రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్రలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాల చాలా అద్భుతంగా ఉండనున్న ది.

సింహ రాశి : సింహ రాశి వారికి చంద్రుడు, కుజ గ్రహ సంయోగం వలన ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగం లక్కు తీసుకొస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు, వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది

మేష రాశి : మేష రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం చాలా శుభప్రదమైనది. ఈ రాశి వారి విద్యార్థులకు, వ్యాపారస్తులకు, చాలా రకాల మేలు చేస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.