శివుని అనుగ్రహం కోసం సోమవారం వీటితో అభిషేకం చేయండి..అన్ని సమస్యలకు పరిష్కారం పొందండి

|

Jul 29, 2024 | 9:02 AM

శ్రావణ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైన రోజే.. ఈ నెలలో శివ భక్తులు సోమవారాన్ని అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. సోమవారం శివుడికి అంకితమైన రోజు కనుక శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివయ్యను పూజించడం, శివలింగానికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి, అతని ఆశీర్వాదాలు పొందడానికి కొన్ని నియమాలను పాటించాలి. శ్రావణ మాసం సోమవారం శివారాధనకు ఉత్తమమైన రోజు. మతం, పురాణ గ్రంధాల ప్రకారం శ్రావణ మాసం చాలా ముఖ్యమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

1 / 7

శ్రావణ సోమవారం భోలాశంకరుడిని పూజిస్తే భక్తులందరి కోరికలు తీరుస్తాడని చెబుతారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం కూడా శ్రేయస్కరం. దీనితో పాటు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అతని ఆశీస్సులు పొందడానికి అనేక నియమాలున్నాయి. అవి ఏమిటంటే..

2 / 7
జ్యోతిష్యుల ప్రకారం శ్రావణ సోమవారం నాడు మహాదేవుడు, పార్వతీ దేవి సన్నిధిలో కుంకుమపువ్వు కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఏడాది పొడవునా సంపదలు చేకూరుతాయి. శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేయడం కూడా శ్రేయస్కరం. ఈ పరిహారాన్ని అనుసరించడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

3 / 7
శ్రావణమాసంలో నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్యాలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి. ఈ పరిహారాన్ని శ్రావణ మాసం అంతా అనుసరించవచ్చు. ఫలితాలను నాలుగు రెట్లు పొడవచ్చు.

4 / 7
శివయ్యను శాంతింపజేస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు, సంబంధాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. వైవాహిక జీవితం బలపడాలంటే భార్యాభర్తలు శ్రావణ మాసంలోని అన్ని సోమవారాల్లో శివుడు,పార్వతీదేవికి పంచామృతంతో అభిషేకం చేయాలి.

5 / 7
ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి కుదరకపోతే శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి. నీళ్లతో నిండిన పాత్రలో కొద్ది మొత్తంలో గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయవచ్చు. దీన్ని అనుసరించడం వల్ల వివాహం కుదిరే అవకాశాలు పెరుగుతాయి.

6 / 7
ఉద్యోగం, వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక నివారణలు కూడా ఉన్నాయి. పండితులు చెప్పిన ప్రకారం శ్రావణ మాసం అంతా శివపార్వతులను పూజించండి. శ్రావణ మాసం చివరి సోమవారం నాడు పార్వతీ దేవికి వెండి పాదాలను సమర్పించండి.  ఇలా చేయడం వలన ఉద్యోగ, వ్యాపారస్తులకు ఆర్ధిక ఇబ్బందులు ఉంటె తొలగిపోతాయి.

7 / 7
ఉద్యోగం పొందడానికి, పోటీ పరీక్షలలో విజయం కోసం ప్రతి శ్రావణ మాసంలో సోమవారం శివలింగానికి 11 మొత్తం బిల్వ పత్రాలను, తేనె సమర్పించవచ్చు. ఇలా చేయడం వలన  శుభ  ఫలితాలు పొందుతారు.