Surya Kala |
Jul 25, 2021 | 8:57 PM
అమ్మా బైలెల్లింది.. సల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు బోనంతో బారులు తీరారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. తెల్లవారు జామునుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు బారులు తీరారు
మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శోభమ్మతోపాటు రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కూడా ఉన్నారు
Ujjain Bonalu 5
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ మాస్కులు అందజేస్తున్నారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రేపటి వరకూ ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు.. ప్రజలను చల్లగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా అనుగ్రహించాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు.