శ్రీ క్షీరారామలింగేశ్వరునికి తలపాగా ఎలా తయారు చేస్తారో తెలుసా?

Edited By:

Updated on: Feb 02, 2026 | 7:47 PM

ఏలూరు: మహా శివరాత్రి సమీపిస్తుంది. ఈ సందర్భంగా పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుని ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా ఏర్పాటు చేస్తారు. కార్తికమాసంలోనే పాగా నేసె కార్యక్రమం ప్రతి ఏటా మొదలవుతుంది . అయితే ఈ ఆచారం ఎపుడు మొదలైంది ..మల్లన్న పాగా విసిస్టత ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. మహా శివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవం సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా కడతారు. ఈ పాగాను శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలోను , పంచారా క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి వారికి మాత్రమే మహా శివ రాత్రి పర్వదినం నాడు లింగోద్భవం సమయంలో మల్లన్న పాగాను సమర్పిస్తారు.

1 / 5
లింగోద్భవ సమయానికి స్వామివారి గర్భాలయం శిఖరం నుంచి గాలిగోపురం శిఖరం వరకూ రెండు పేటలుగా అమరుస్తారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు అర్థరాత్రి సమయంలో తండోపతండా లుగా తరలివస్తుంటారు. స్వామివారికి సమర్పించే ఈ పాగాను  పాలకొల్లు మండలం లోని దగ్గులూరు  గ్రామానికి చెందిన అందే వీరన్న మగ్గం పై నికి స్వామి వారికి సమర్పించే ప్రక్రియ 1979లో ప్రారంభించారు.

2 / 5
శ్రీశైలంలో ఏర్పాటుచేసే పాగాను చూసిన వీరన్న నాడు క్షీరారా మలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదించి ఆలయ అధికారుల అనుమతితో నాడు మల్లన్న పాగాను స్వయంగా మగ్గంపై నేచి స్వామివారికి సమర్పించేవారు. అనంతరం వీరన్న అల్లుడుకు వారసత్వంగా ఈ పాగాను నేయడం అందించారు. నేడు వారి మనవడు వరదా సోమేశ్వరరావు తన తాతగారి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. ఖర్చుతో కూడుకున్నా, పనిభారమైనా.. స్వామివారు ఇచ్చిన అదృష్టాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు.

3 / 5
కార్తీకమాసం ప్రారంభంలో పాగా నేతకు పనులు ప్రారంభిస్తారు. ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పాగా పనులు ప్రారంభిస్తారు. కృష్ణాజిల్లా పెడన వెళ్లి నూలు  తెచ్చుకుని ఆ నూలును తడిపి ఐదు రోజులు పాటు నానబెడతారు. ఆరవ రోజు ఆ నూలుకు గంజి పెట్టి ఎండలో ఆరబెడతారు. అనంతరం రాట్నంతో నూలు తోడుకుంటారు. నూలు తోడుకున్న డబ్బాలతో తూర్పుగోదావరి జిల్లా బండారులంక తీసుకువెళ్లి అక్కడ ఈ నూలును రోలింగ్ (దంత్రం) చేయిస్తారు. 200 గజాల పొడుగు వచ్చేలా రోలింగ్ చేస్తారు. అక్కడ నుంచి దానిని నరసాపురం తీసుకువస్తారు. ఇక్కడ సుమారు 26 మంది భక్తి శ్రద్ధలతో రూలింగ్‌కు గంజి పెట్టి పడుగ  ఏర్పాటు చేస్తారు. అనంతరం దానిని చుట్టుకుని ఇంటికి తెచ్చి అల్లుసాపుకుని అంతరం బొండకు చుడతారు. ఈ సమయంలో సుమారు చుట్టుపక్కల ఓ పది, పదిహేను మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొంటారు. ఆ బొండను మగ్గం ఎక్కిస్తారు.

4 / 5
మహా శివరాత్రికి ముందుగా రెండు లేక మూడు నెలలు ముందు ఇంటిలో స్వామివారి పీఠం ఏర్పాటుచేసుకుని ఆ బొండను మగ్గం ఎక్కించి అప్పటి నుంచి పాగాను నేయడం మొదలు పెడతారు. ప్రతి రోజు ఉదయం కొబ్బరికాయ కొట్టి మగ్గం నేయడం ప్రారంభించి ఉదయం రెండు గంటలు, రాత్రి ఓ ఆరు గంటలు పాటు నేస్తుంటారు. రాత్రి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నేతను ముగిస్తారు. ఇలా రోజుకు దాదాపు నాలుగు లేదా ఐదు మూరలు నేస్తుంటారు. మిగిలిన సమయంలో వాళ్ల వృత్తి ప్రకారం నేత చీరలు నేస్తుంటారు. ఈ పాగాను 180 మీటర్లు పొడవు, 90 సెంమీ వెడల్పుతో ఏర్పాటు చేస్తారు.

5 / 5
స్వామివారికి రోజుకు ఓ మూర చొప్పున లెక్కించి 365 మూరలు వచ్చేలా పాగా తయారు చేస్తారు. అలాగే మరో 20 మూరలు పార్వతి అమ్మవారికి సమర్పిస్తారు. పాగా నేస్తున్న అన్ని రోజులు మద్యం మాంసాహారం ముట్టుకోకుండా దీక్షతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంటారు. అలాగే ఈ మగ్గాన్ని ఒక్క స్వామివారి పాగా నేయడం కొరకే ఉపయోగిస్తుంటారు. పంచా రామాల్లో ఎక్కడా లేని ఈ పాగా నేత తమకు క్షీరా రామలింగేశ్వరస్వామి కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాం అని తమ పూర్వీకులు తమకి ఇచ్చిన వారసత్వాన్ని  నిలబెట్టుకుంటున్నాము అని వరదా సోమేశ్వరరావు చెబుతున్నారు.