
కొబ్బరికాయను హిందువులు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ కొబ్బరి సూచిస్తుంది. అందువల్లనే కొబ్బరి కాయకు పూజా ద్రవ్యాల్లో ప్రముఖ స్థానం ఇచ్చారు.

కొబ్బరికాయ పార్వతి పరమేశ్వరులను సూచిస్తుందని మరొక నమ్మకం. కొబ్బరిలోని మూడు చుక్కలు శివుని మూడు కళ్లకు ప్రతీక. తెల్లని కొబ్బరి పార్వతిని సూచిస్తుంది. కొబ్బరి నీరు గంగను సూచిస్తుంది. గోధుమ రంగు షెల్ కార్తికేయను సూచిస్తుంది

కొబ్బరి కాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాదు గుండ్రని కొబ్బరి వుండే ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరిని కొట్టిన తరువాత అందులో వుండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవునికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం అన్ని తొలగుతాయి అంటారు.

కొబ్బరి చిప్ప అహాన్ని సూచిస్తుంది. అందులోని తెల్లని మృదువైన గుజ్జు మానవ హృదయాన్ని, నీరు స్వచ్ఛతను సూచిస్తుంది. అందువల్ల భక్తులు కొబ్బరి కాయను దేవుడికి సమర్పిస్తూ.. తన అహాన్ని తొలగించి... జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు.

ఇక కొబ్బరి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు తక్కువ ధరలో సులభంగా లభిస్తుంది. ఇక దేవుడికి కొబ్బరికాయను కొట్టి సమర్పించడాన్ని ఆత్మసమర్పణంతో సమానంగా హిందువులు భావిస్తారు.