AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketu Blessings: కేతువు కటాక్షం.. వీరి జీవితం ఒక్కసారిగా మారిపోయే ఛాన్స్..!

కేతువు ఒక మిస్టరీ గ్రహం. ఆకస్మిక శుభ పరిణామాలకు, ఆకస్మిక శుభ ఫలితాలకు పెట్టింది పేరు. ఇది వక్ర గ్రహమైనప్పటికీ, ఆధ్యాత్మిక గ్రహం కూడా. ప్రస్తుతం కేతువు అనుకూల సంచారం కారణంగా.. డిసెంబర్ 5న కేతువు రాశి మారే లోపు కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. సింహ రాశిలో తన మఖా నక్షత్రంలో సంచారం చేస్తున్న కేతువు మన ప్రణా ళికలకు, ప్రయత్నాలకు, ఆలోచనలకు విరుద్ధంగా తనదైన శైలిలో ఊహించని యోగాలనివ్వడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశులవారికి కేతువు వల్ల జీవితాలు మారిపోయే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 8:11 PM

Share
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల గత 16 నెలలుగా తప్పటడుగులు వేస్తున్న ఈ రాశివారికి ఊహించని విజయాలు, సాఫల్యాలు అనుభవానికి రావడం ప్రారంభమవు తుంది. విమర్శించినవారి దగ్గర నుంచి ప్రశంసలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలు, ఇతర ఆదాయ ప్రయత్నాలు కలిసి రావడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం ఉన్నా, ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

1 / 6
వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల సుఖ నాశనం, తల్లికి అనారోగ్యం, తరచూ స్థాన చలనాలు, ఉద్యోగంలో స్థిరత్వం లభించకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక గృహ లాభం, ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం, తల్లికి ఆరోగ్యం, ఉద్యోగంలో పదోన్నతి, సామాజికంగా గుర్తింపు తప్పకుండా కలుగుతాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశివారికి ఆదాయం పెరిగినప్పటికీ, మానసికంగా సంతృప్తి లేకపోవడం, మనశ్శాంతి కరువ వడం, కుటుంబ సమస్యలు తలెత్తడం, రావలసిన సొమ్ము రాకపోవడం వంటి సమస్యలకు కేతువు ద్వితీయ స్థానంలో ఉండడమే కారణం. త్వరలో రాశి మారబోతున్న కేతువు ఇక ఈ రాశి వారికి మనశ్శాంతినిచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందడం, ఆర్థిక, వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం కావడం, కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

3 / 6
సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఈ రాశివారిలో ఎంతటి ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాదు. ఉద్యోగంలో పైకి ఎదిగే అవకాశం ఉండదు. బంధుమిత్రులు దూరమవుతారు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేతువు అనుకూల సంచారం వల్ల ఈ రాశివారి జీవితంలో పురోగతి ప్రారంభం అవుతుంది. ఆదాయ వృద్ధికి, ఉద్యోగంలో పదోన్నతులకు, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడానికి, మనసులోని కోరికలు, ఆశలు నెరవేరడానికి అవకాశాలు కలుగుతాయి.

4 / 6
తుల: లాభ స్థానంలో కేతువు సంచారం వల్ల పురోగతి ఆగిపోవడం, అవమానాలు ఎక్కువగా ఉండడం, బంధువుల వల్ల ఇబ్బందులు పడడం, ఏదీ కలిసిరాకపోవడం, పురోగతి స్తంభించిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. మరి కొద్ది కాలంలో రాశి మారబోతున్న కేతువు ఇక ఈ రాశివారిని అందలాలు ఎక్కించడం ప్రారంభిస్తాడు. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభకా ర్యాలు జరుగుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి.

5 / 6
ధనుస్సు:ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఆధ్యాత్మిక చింతన పెరగడం తప్ప మరే ప్రయోజనమూ సిద్ధించే అవకాశం లేదు. విదేశీ ప్రయత్నాలు ఫలించడం కష్టమవుతుంది. తండ్రి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉండదు. ఆదాయం ఒక పట్టాన వృద్ధి చెందదు. ఆ పరిస్థితిలో మార్పు వచ్చి, తండ్రికి ఆరోగ్యం లభిస్తుంది. ధన లాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ప్రతి పనీ, ప్రయత్నమూ కలిసి వస్తాయి.

6 / 6
Follow Us