
మేషం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో, అంటే వృద్ధి స్థానంలో భాగ్యాధిపతి గురువు సంచారం వల్ల ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న లాభాధిపతి గురువుకు బలం పెరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

సింహం: ఈ రాశికి పంచమాధిపతి అయిన గురువు లాభ స్థాన సంచారం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తిపాస్తులపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు.

తుల: ఈ రాశికి గురువు భాగ్య స్థానంలో సంచారం వల్ల విదేశీ సంబంధమైన వ్యవహారాలు, ప్రయత్నాలన్నీ తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అయి, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో స్వనక్షత్రంలో సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు క్రమంగా ఆర్థికంగా బలపడతాయి. భాగస్వాములతో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోయి, అన్యోన్యత బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబా నికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కుంభం:ఈ రాశివారికి పంచమ స్థానంలో ధన కారకుడు గురువు సంచారం చేస్తున్నందువల్ల, అనేక విధాలుగా ధనాభివృద్ధి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశముంది.