January 2026 Horoscope: అంచనాలకు మించి వారి ఆదాయం వృద్ధి.. 12 రాశుల వారికి మాసఫలాలు

Edited By:

Updated on: Dec 31, 2025 | 3:59 PM

మాస ఫలాలు (జనవరి 1-31, 2026 వరకు): మేష రాశి వారికి ఈ నెలంతా వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. అనుకున్న దల్లా నెరవేరుతుంది. మిథున రాశి వారికి ఈ నెలంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి జనవరి 2026 మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛపడుతుండడంతో పాటు, రవి, బుధ, రాహు గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల జనవరి నెలంతా వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అసాధ్యమనుకున్న పనులను కూడా పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూలతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శుక్ర, బుధ, కుజులు భాగ్య స్థానంలో ప్రవేశించడం, లాభ స్థానంలో శని సంచారం, ధన స్థానంలో గురువు ఉండడం వల్ల ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. అనుకున్న దల్లా నెరవేరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో సఫలం అవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగు తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): మధ్య మధ్య చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ బుధ, శుక్ర, రవి గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు ఉపకరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. వ్యక్తి గత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వ్యయ స్థానంలోని గురువు వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధు మిత్రులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది.  రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అష్టమ శని ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ, రాశ్యధిపతి రవితో పాటు కుజ, గురు, శుక్రుల అనుకూలత వల్ల కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రతి విషయం లోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలన్నీ సాదా సీదాగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆద రణ లభిస్తుంది. కొద్దిగా పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగపరంగా శుభ వార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభా లుంటాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడితో పాటు రాహు, గురు, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల నెలంతా బాగా అనుకూలంగానే గడిచిపోతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి లోటు ఉండదు కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.  పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.  తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శని, బుధ, కుజ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దేనికీ లోటుండని పరిస్థితి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు ఒక వెలుగు వెలుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండక పోవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అవివాహితులకు సొంత ఊర్లోనే మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది.  కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ పురోగతి ఉంటుంది.  ఆశించిన శుభవార్తలు వింటారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో శుక్ర, బుధులతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఇతరత్రా కూడా నెలంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను తేలికగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఆస్తి వివాదంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యక్తిగతంగా చిన్నా చితకా సమస్యలుండవచ్చు. అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఎవరితోనూ ఆర్థిక లావా దేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.  ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. ఎవరి మీదా ఆధారపడకపోవడం, ఎవరినీ నమ్మకపోవడం మంచిది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రవి, కుజ, శుక్ర, బుధుల అనుకూల సంచారంతో పాటు రాశ్యధిపతి గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని కీలక వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది.  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆశించిన పురోగతి ఉంటుంది. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది.  నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని సంచారంతో పాటు ఈ నెల 12 నుంచి ఈ రాశిలో శుక్ర, కుజుల సంచారం కూడా జరుగుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఇతర సానుకూలతలకు కూడా లోటుండదు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లా సంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, లాభాల బాటపడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. తల్లితండ్రులు, జ్యేష్ట సోదరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధనాధిపతి గురువు అనుకూలంగా ఉండడంతో పాటు, ధన స్థానంలో రాశ్యధిపతి శని, లాభ స్థానంలో రవి, బుధ, కుజుల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా కొద్దిగా వ్యయప్రయాసలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్య మైన పనులు నిదానంగా పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత తప్పదు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువుతో పాటు దశమ స్థానంలో రవి, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్ది శ్రమతో ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగు లోకి వస్తాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరగడం వల్ల తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు ఉత్సాహంగా సాగిపోతాయి.