హిందువులు ఎంతో పవిత్రంగా భావించి పూజించే తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే.. ఆ ఇంట్లో ఆనందం, సంతోషం ఎప్పుడు కొలువై ఉంటుందట. ఆ ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్ధం.
తులసి మొక్కకు రోజూ పూజ సమయంలో నీరు పోస్తారు..అలా నీరు పోయాక పోయినా ఆ తులసి మొక్క ఏపుగా , పచ్చగా పెరుగుతుంటే.. ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట.
తులసి మొక్క ఆకులు అకస్మాత్తుగా ఎడిపోయినా వేరే రంగులోకి మారిపోయినా .. ఆ ఇంట్లో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని హిందువుల నమ్మకం
అప్పటి వరకూ తులసి మొక్క ఎంతో ఏపుగా పెరుగుతూ ... అకస్మాత్తుగా ఎండిపోతే.. ఆ ఇంటి యజమాని అనారోగ్యం బారిన పడతారనడానికి సూచనట.
ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషదాల గని , ఆరోగ్య ప్రదాయాని తులసి. ఈ మొక్కకి భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే కాదు.. తులసి వాడిపోకుండా ఆరోగ్యంగా ఉండేలా సూచుకోవాలని. తులసి పెరుగుదలను గమనిస్తుండాలి పెద్దలు ఎప్పుడో సూచించారు.