Balaraju Goud | Edited By: Team Veegam
Mar 25, 2021 | 1:31 PM
రాధా-కృష్ణుడి ప్రత్యేక ప్రేమ భూమి అయిన బ్రజ్‌లో ఆడంబరంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సాహంగా భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు.
ఠాకూర్ బాంకే బిహారీ భక్తులతో కలిసి హోలీ ఆడారు.
బ్రజ్ ప్రాంతంలో హోలీ మహోత్సవ్ బసంత్ పంచమితో ప్రారంభమవుతుంది. రంగుల పండగ 40 రోజులపాటు కొనసాగనుంది.
మధురలోని బృందావన్ వద్ద హోలీ వేడుకలకు నాంది పలికుతారు. బసంత్ పంచమి పండుగ సందర్భంగా భక్తులు తమను తాము రంగులతో తడిచి ముద్దవుతారు. ఆ ప్రాంతమంతా బిహారీజీ నామస్మరణతో మార్మోగింది.
బసంత్ పంచమి పండుగ సందర్భంగా పూజారులు బాంకీ బిహారీ ఆలయంలో భక్తులపై 'గులాల్' రంగులను చల్లారు. భక్తలు రంగేళి పండుగను సంబురంగా జరుపుకుంటున్నారు.
బసంత్ పంచమి పండుగ సందర్భంగా భక్తులు బ్యాంకీ బిహారీ ఆలయంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.