
ఫాల్గుణ శుక్ల పక్ష చతుర్దశి సోమవారం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ ప్రాంగణంలో దేవుడికి, భక్తులకు మధ్య పూల హోళీ ఘనంగా జరిగింది.

గత కొన్నేళ్లుగా మహాదేవుడి ఆలయంలో పువ్వులతో హోలీ ఆడుతున్నారు. వందలాది మంది భక్తులు సోమవారం దేవుడితో హోలీ ఆడి తమ జీవితం ధన్యమైనట్లు భావించారు.

దీంతో ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో హొలీ పండుగ ప్రారంభమైనట్లు ఆలయ పూజారి దిలీప్ తెలిపారు. ఆదివారం మహిళా భక్తులు మహాకాళేశ్వరుడితో హోలీ ఆడిన అనంతరం భక్తులు సోమవారం భస్మ హారతిని ఇచ్చారు.

మహాకాళేశ్వరుడితో హొలీ ఆడడం కోసం దాదాపు 40 క్వింటాళ్ల వివిధ రకాల పూలను మహారాష్ట్రకు చెందిన భక్తుడు సమర్పించాడు. ఈ పూలతో భక్తులు సంతోషముగా హోలీ ఆడారు.

మార్చి 7వ తేదీ మహాకాళేశ్వరుడి ఆలయ ప్రాంగణంలో హెర్బల్ గులాల్‌తో హోలీ ఆడనున్నారు. సోమవారం భస్మాన్ని సమర్పించిన తరువాత శివయ్య నిరాకారుడి నుండి భౌతిక రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. నంది హాలులోనూ భక్తులు ఒకరిపై ఒకరు పువ్వులతో హొలీ ఆడుతూ పూలవర్షం కురిపించుకున్నారు. రేపు భస్మ హారతి తర్వాత హెర్బల్ గులాల్‌తో హోలీ ఆడనున్నారు.