Sri Kukkuteswara Swamy: త్రిగయా క్షేత్రాల్లో ఒకటి .. పితృముక్తి క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఆ ఆలయం విశిష్టత ఏమిటంటే..

|

Jul 27, 2021 | 1:37 PM

Kukkuteswara Swamy: తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రం.. జైన, బౌద్ధ, శైవ , వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి పొందింది. పిఠాపురాన్ని పూర్వం 'పీఠికాపురం'గా కీర్తిగాంచింది. ఇక్కడ వెలసిన రుహూతికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 10 వ శక్తి పీఠం.. ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి..

1 / 7
 చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది.   ఏ ఊరు పూర్వం బుద్ద రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్ధమని అంటారు.

2 / 7
పాదగయ తీర్ధం వద్ద  గయాసురుని పాదాలున్నాయి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే.. పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం

3 / 7
పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు.. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచినవారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు

4 / 7
కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.

5 / 7
పిఠాపురం దత్త క్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన 'శ్రీ పాద శ్రీ వల్లభ. స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు.

6 / 7
శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది.  మిగతా దత్త క్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి.

7 / 7
త్రిగయా క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం.. పితృ ముక్తి కరమ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక రైలు మార్గంగా ద్వారా చేసుకోవాలంటే సమీపంలో సామర్లకోట రైల్వే జంక్షన్ వద్ద దిగాల్సి ఉంది. పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంమాత్రమే