జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, కుజ గ్రహాలు మంచి స్నేహితులు. ప్రస్తుతం గోచారంలో గురు, కుజ గ్రహాలు పరస్పరం చూసుకుంటుండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు కలగడం, శుభ యోగాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో గురు గ్రహం పుత్ర కారక గ్రహం అయినందువల్ల పిల్లలకు సంబంధించి ఆరు రాశులకు విశేష యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో లేదా వృత్తి, ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధించడం, విదేశాలకు వెళ్లడం, మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం, వారిలోని నైపుణ్యాలకు, ప్రతిభా పాటవాలకు గుర్తింపు రావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇది నవంబర్ 16న కుజుడు రాశి మారే వరకు కొనసాగుతుంది. ఈ ఆరు రాశులుః మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభం.