Lord Ganesh: వామ్మో విఘ్నాలకధిపతి వినాయకుడికి 108 రకాల ప్రసాదాలు.. ఇంతకీ ఎక్కడ..

| Edited By: Ram Naramaneni

Sep 23, 2023 | 11:32 AM

గణపతి నవరాత్రులు దేశ వ్యక్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హిందూ సనాతన ధర్మంలో వినాయకుడునీ ఉండ్రాళ్ళ ప్రియుడని, నైవేద్య ప్రియుడని చెబుతూ ఉంటారు. అందుకే ఏడాదికి ఓసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారికి ప్రసాదానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటారు భక్తులు. స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంతో పాటు వివిధ రకాలైన ఫలాలు సమర్పించి ఆరాధిస్తారు.

1 / 6
108 రకాల వంటకాలను ప్రసాదంగా సమర్పించటం వినాయకుడికి ఎలా ఉందో తెలియదు గానీ అన్నీ రకాల వంటకాలను చూసిన వారిలో నోరూరకుండా ఉన్నవారు లేరు అంటే మాత్రం అతిశయోక్తి కాదు.

2 / 6
కానీ ఇలా వినాయకుడికి రుచికరమైన  108 వంటకాలను ప్రసాదాలుగా సమర్పించి చూసేవారoదరిని అబ్బురపరిచి ఔరా అనిపించారు.

3 / 6
దేవుడికి 108 ప్రదక్షిణాలు చేయటం, 108 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించటం వంటివి చూసాం...ప్రముఖ పుణ్యక్షేత్రాలలో 108 స్వర్ణ తులసి దళాలు లేదా స్వర్ణ పుష్పాలతో జరిపే ఆర్జిత సేవల గురించి విన్నాం.

4 / 6
 ప్రసాదాలు సమర్పించటం తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక సామూహిక పూజలు చేశారు.

5 / 6
  గులాబ్ జాములు, జాంగ్రీలు, బాదుషాలు , పంచదార చిలకలు, బూరెలు, అరిసెలు, పాల కోవాలు, కారపు బూందీ, మురుకులు,చేగోడీలు, పులిహోర, దద్దోజనం ఇలా చెబుతూ పోతే ఒకటా రెండా నోరూరించే అనేక రకాల స్వీట్లు, హాట్ పదార్దాల్న స్వామివారి ముందు కొలువు తీర్చారు భక్తులు.

6 / 6
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ లోని ఆంజనేయ నగర్ లో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయకుడికి ప్రసాదాలతో  ముంచెత్తారు కాలనీ వాసులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 108 రకాల ప్రసాదాలను సమర్పించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.