ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు మేషరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. చంద్ర, గురువులు ఒకే రాశిలో ఉండడం లేదా ఒకరికొకరు 4,7,10 స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం అనేది విజయాలకు, సాఫల్యాలకు, సుఖ సంతోషాలకు, పేరు ప్రఖ్యాతులకు, యత్న కార్యసిద్ధికి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలకు సంకేతం. ఈ గజ కేసరి యోగం పట్టే రాశులవారు స్వయంగా ప్రముఖులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ యోగం పట్టినప్పుడు శని దోషాలు, కుజ దోషాలు, రాహు దోషాలు వర్తించే అవకాశం ఉండదు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభ యోగంగా, తప్పకుండా జరిగే యోగంగా పేరున్న ఈ యోగం ప్రస్తుతం మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు పడుతోంది. ఈ రాశులు వారికి ఈ యోగం ఎటువంటి శుభ ఫలితాలనిస్తుందో చూద్దాం.