
ఇంట్లో లైటింగ్ ఒక అందమైన డెకరేషన్. ఈ ఇంట్లో బాటిల్ లో ఉండే దీపాలను అలంకరించడం వలన మీ హోం మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

ఇంట్లో తాజా పువ్వులను అలంకరణకు ఉపయోగిస్తే మీరు ఉత్సాహంగా ఉంటారు. ప్రకృతి రంగురంగుల సువాసన డిఫ్యూజర్లు, పూలకుండీలను అమర్చడం ద్వారా మీరు ఉల్లాసంగా ఉంటారు.

అన్నింటి కంటే ముఖ్యమైనది ప్రార్థన స్థలం. మీరు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే మనసుకు హాయినిచ్చే రంగుల తివాచీలను ఎంచుకోవడం ఉత్తమం. దీనివలన ఈ ప్రార్థనలు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు.

ఇంట్లో అలంకరణకు కొవ్వోత్తులను వాడండి.. సువాసనలు గల కొవ్వోత్తులను ఈ ఇంట్లో అలంకరించడం ద్వారా మనసుకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది.

ఇంట్లో లాంతర్లను కట్టడం వలన మరింత అందంగా కనిపిస్తుంది. సాంప్రదాయ అరేబియా లాంతర్లు మరింత క్లాసిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవే కాకుండా మొరాకో లాంతర్లను ఉపయోగించండి.

ప్రియమైన వారికి అందమైన హ్యాండ్ మేడ్ ఫ్రేములను అలంకరించండి. ఫోటోలు, లేదా కాలిగ్రఫీని ప్రింట్ చేసి.. దానిని ఫ్రేములో బంధించి ఇంట్లో అలంకరించండి.

రంజాన్..