
శక్తి వంత మైన గ్రహాలు శుక్ర గ్రహం, బుధ గ్రహం కూడా తుల రాశిలో సంచారం చేస్తాయి. ఈ రెండు రాశులు కూడా డిసెంబర్ నెల ప్రారంభం వరకు తుల రాశిలోనే ఉండనున్నాయి. దీంతో రెండు గ్రహాల కలయిక వలన మూడు రాశుల వారికి ఊహించని లాభాలు ఉండనున్నాయి. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవి అంటే?

మేష రాశి : మేష రాశి వారికి బుధ గ్రహం, శుక్ర గ్రహం తుల రాశిలోకి సంచారం చేయడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశుల వారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు, ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా అనుకోని విధంగా వీరికి డబ్బు చేతికందుతుంది.

కుంభ రాశి :కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తుల రాశి : తుల రాశి వారికి ఊహించని లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా అందులో త్వరగా సక్సెస్ అవుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అనేక లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.