- Telugu News Photo Gallery Spiritual photos Due to Kotishwar Yoga, men of these zodiac signs will get money from their wives
భార్య ద్వారా కోటీశ్వర యోగం.. ఈ రాశుల పురుషులకు డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం , అదృష్టం అనేది ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అయితే కొన్ని రాశుల పురుషులకు లక్కు కలిసి వస్తుందంట. అప్పటి వరకు పేదవారిగా ఉన్నా, తన భార్య ద్వారా కోటీశ్వరులు అవుతారంట. కాగా, ఇంతకీ ఏ రాశుల వారి పురుషులకు ధనవంతురాలైన భార్య లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 03, 2025 | 2:58 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మొత్తం పన్నెండు రాశులు, తొమ్మది గ్రహాలు. ఇక ఒక్కో రాశి వ్యక్తిత్వం, ఒక్కో రకంగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు గ్రహాల ప్రభావం వలన కొందరికి లక్కు కలిసి వస్తే కొందరికి ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం భార్య వలన ఏ రాశుల వారు భార్య వలన కోటీశ్వరులు అవుతారో చూద్దాం.

వృషభ రాశి : వృషభరాశి పురుషులు ఎక్కువగా విలాసాలకు ఇంట్రస్ట్ చూపుతుంటారు. అయితే వీరి వద్ద ఎప్పుడూ ఎక్కువగా డబ్బు ఉండదు, కానీ వీరికి వీరి భార్య ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారిలో ఉండే స్పెషల్ లక్షణాలే వీరి జీవితంలోకి ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది. దీని వలన వీరు వివాహం తర్వాత కోటీశ్వరులు అవుతారు.

తుల రాశి :తుల రాశి వారికి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు , ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, వీరికి వీరి భాగస్వామి వచ్చిన తర్వాత అదృష్టం కలుగుతుంది. ధనవంతురాలైన భార్య రావడం వలన వీరి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బుకు కొదవే ఉండదు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి వివాహం లక్కును తీసుకొస్తుంది. వీరు వివాహం తర్వాత చాలా త్వరగా ధనవంతులు అవుతారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. భార్య వలన అన్ని విధాల కలిసి వస్తుందంట.

మకర రాశి : మకర రాశి వారికి వివాహం తర్వాత ఒక్కసారిగా అదృష్టం అనేది మారిపోతుంది. వీరికి ఊహించిన విధంగా డబ్బు చేతికందుతుంది. అంకిత భావంతో పని చేస్తారు. ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు తమ భార్య వలన లక్షాధికారులు అవుతారు. డబ్బుకు కొదవే ఉండదు.



