
దీపావళి 2024 ఎప్పుడు వచ్చిందంటే .. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ పండుగను పెద్దలు, పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. 2024లో దీపావళి తేదీ విషయంలో చాలా గందరగోళం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ అమావాస్య అక్టోబర్ 31న మధ్యాహ్నం 03:52 గంటలకు ప్రారంభమై 01 నవంబర్ 2024న సాయంత్రం 06:16 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో 01 నవంబర్ 2024న దీపావళి పండుగను జరుపుకోవడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

పాత బూట్లు, చెప్పులు: చాలా మందికి పాత వస్తువులను పారవెయ్యడం ఇష్టం ఉండదు. అవి ఏదోక విధంగా పనిచేస్తయంటూ ఇళ్లలో పాత వస్తువుల ఏదోక మూలలో పెట్టుకుంటారు. ఇలా చేయడం సరైనది కాదు. దీపావళి పండగ సముయంలో ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంట్లో పాత బూట్లు, చెప్పులు ఉంటె వాటిని తొలగించాలని అంటారు. దీనివల్ల ఇంట్లోని దారిద్య్రం తొలగి సిరి, సంపదలు పెరుగుతాయి.

పగిలిన గాజు వస్తువులు: విరిగిన గాజు ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో పగిలిన అద్దాలు ఉన్నా.. పగిలిన గాజులు ఉన్నా వాటిని భద్రంగా ఉంచకుండా బయటకు విసిరేయాలని అంటారు. విరిగిన గాజు, అద్దాలు ఇంట్లో ఉంటె ప్రతికూలత వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదని నమ్మకం.

పాత చిత్ర పటాలు: పాతవి లేదా విరిగిన విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఇళ్లలో ఉంచుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలా చేయకూడదు. విరిగిన విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపించి ఇంట్లో కష్టాలు పెరుగుతాయని అంటున్నారు.

ఇంట్లో కొంతమంది ఏళ్ల తరబడి కొన్ని వస్తువులను నిల్వ చేస్తారు. చెత్త ఉండే ప్రదేశంలో చిగిరిన బట్టలు సహా వార్తాపత్రికలు, కార్డ్‌బోర్డ్, ఇతర వ్యర్థ పదార్థాల వరకు ప్రతిదీ ఒక ప్లీస్ లో గుట్టలుగా పోగు చేస్తారు. అయితే దీపావళికి ముందే ఇలాంటి చెత్తను తొలగించండి. దీపావళికి ముందు ఇంటిని శుభ్రపరిచే సమయంలో ఇంట్లో పేరుకున్న చెత్త వస్తువులను ఇంటి నుండి బయట పడేయండి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సుల వర్షం ఆ ఇంట్లో కురుస్తుంది.