Diwali Vastu Tips: దీపావళికి ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా.. ఈ రంగులు బెస్ట్ ఎంపిక..
హిందువుల ప్రముఖ పండగల్లో దీపావళి కూడా ఒకటి. దసరా నవరాత్రుల సందడి నుంచి బయటకు వచ్చిన ప్రజలు దీపావళి పండగ కోసం రెడీ అవుతున్నారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండగ జరుపుకోవడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి. లోక కంటకుడైన రాక్షసుడు నరకాసుడిని వధించి ప్రజలకు, మునులకు రాక్షసుడి నుంచి విముక్తి కలిగించిన రోజుగా నరక చతుర్దశి , దీపావళిని జరుపుకుంటారు. అంతేకాదు శ్రీ రాముడు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు వచ్చిన రోజుని కూడా ప్రజలు దీపావళిగా జరుపుకున్నారని.. అప్పటి నుంచి దీపావళిని జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతుందని విశ్వాసం.