
అమావాస్య వచ్చిందంటే చాలు కొందరు భయపడి పోతుంటారు. ఇక అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది, ఈ రోజున దృష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అందుకే ఈ రోజు ఎక్కువగా బయట తిరగకూడదు అని చెబుతారు. అంతే కాకుండా ఈరోజున కొన్ని పరిహారాలు చేయడం వలన ప్రతికూలతలు తొలికి పోవడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయంట.

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యల బారిన పడుతున్నారు. ఇక కొంత మంది ఎంత కష్టపడినా సరే చేతిలో డబ్బు నిలవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వారు అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే సరిపోతుదంట. ఇంతకీ ఆ పని ఏమిటంటే?

మీ ఇంటిలో ఎప్పుడూ గొడవలు, ఆర్థిక సమస్యలు ఉంటే, అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకోవాలంట. అది ఏమిటంటే? అప్పుల బాధలు ఉన్నవారు, అమావాస్య రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత, ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలంట. దీని వలన ప్రతికూలతలు తొలిగిపోతాయి.

అంతే కాకుండా అమావాస్య రోజున ఒక నిమ్మకాయ తీసుకొని, దానిని నాలుగు ముక్కలు చేసి, ఎవరు అయితే అప్పులతో బాధపడుతున్నారో, వారి చుట్టూ నాలుగు సార్లు తింపుకొని, నాలుగు రోడ్లు ఉన్న చోట, నాలుగు దిక్కుల వేయాలంట. దీని వలన దృష్టి దోషాలు తొలిగి పోవడమే కాకుండా, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. అదే విధంగా, అమావాస్య రోజున గుప్పెడు ఆవాలు తీసుకోని, చుట్టూ తిప్పుకొని, బిల్డింగ్ పైకి ఎక్కి, నాలుగు మూలల్లో కొన్ని కొన్ని పోయడం వలన కూడా అప్పుల బాధలు తీరిపోతాయని చెబుతున్నారు పండితులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు