

అనుభవాల నుండి నేర్చుకోండి: జీవితంలో తగిలే ఎదురుదెబ్బ, బాధలో ఒక పాఠం దాగి ఉంటుందని చాణక్యుడు నమ్మాడు. ఈ అనుభవాలను వృద్ధి, స్వీయ-అభివృద్ధికి అవకాశాలుగా ఉపయోగించండి. పరిస్థితిని విశ్లేషించండి, అంతర్లీన కారణాలను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించడానికి అనుభవాలనుంచి పాఠాలను నేర్చుకోండి.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.