పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయని అంటారు. అయినప్పటికీ భాగస్వామి కోసం వెతకక తప్పదు. మీరు కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారా? భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, పెళ్లికి ముందు ఈ 5 అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలట. ఈ విషయాలన్ని ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రం గ్రంథంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి చాణక్యుడు పేర్కొన్న ఆ 5 అంశాలు, గుణాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఆచార్య చాణక్యుడు నిర్దేశించిన సూత్రాలు జీవితంలో విజయ మంత్రాన్ని సూచిస్తాయి. ఏళ్లు గడిచినా ఆచార్య చాణక్యుడి సూత్రాలు నేటికీ అనుసరణీయంగానే ఉన్నాయి. వ్యక్తి జీవితానికి సంబంధించి అనేక అంశాలను ఆయన తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. అందులో పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా పేర్కొనడం జరిగింది. పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ జీవిత భాగస్వామిలో ధర్మం, సహనం, విలువ, సంతృప్తి, నిగ్రహం, మాట్లాడే విధానాన్ని గమనించాలని స్పష్టంగా పేర్కొన్నారు.

నిగ్రహం, సహనం: నిగ్రహం, సహనం ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని ఏ కష్ట సమయంలోనూ విడిచిపెట్టరు. కుటుంబ సభ్యుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే గుణం వీరికి ఉంటుంది. పెళ్లికి ముందు మీ భాగస్వామిలో సహనం ఉందా? లేదా? అనేది గమనించాలి.

కోపం: మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తిలో కోపం, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో గుర్తించాలి. కోపం సంబంధాల మధ్య చీలికలకు కారణం అవుతుంది. కోపంలో ఆమె/అతను ఏది ఒప్పు, ఏది తప్పు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారు. అది విపరీత పరిస్థితులకు దారి తీస్తుంది.

భార్యాభర్తల మధ్య మధురమైన మాటలు వైవాహిక జీవితంలో సుఖాన్ని పెంచుతాయి. పరుష మాటలు వైవాహిక జీవితంలో దూరాన్ని పెంచుతాయి. అందుకే.. పెళ్లికి ముందే.. మీ భాగస్వామి మాట తీరు, మాట్లాడే స్వభావాన్ని గమనించాలి.

సంస్కృతితో కూడిన జీవితం: జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఆమె/అతని జీవనశైలిని, తన బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యాన్ని గమనించాలి. సంస్కారవంతమైన జీవితం గడిపిన వారికి మోక్షం లభిస్తుందని ఒక విశ్వాసం ఉంది.(గమనిక: పైన పేర్కొన్న వివరాలన్నీ చాణక్యుడి నీతిశాస్త్రం నుంచి ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)