జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా.. ఆ సమయం రాకముందే కచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే మనలో చాలామంది ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు లేదా వాటిని అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. చాణక్య నీతిలో కూడా, ఆచార్య చాణక్యుడు అటువంటి 4 సంకేతాలను పేర్కొన్నాడు, ఇది రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. వాటిని సకాలంలో అర్థం చేసుకోవడం ద్వారా రాబోయే పరిస్థితులను అర్ధం చేసుకుని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు.
తులసి మొక్క ఎండిపోవడం: తులసిని దైవం పరిగణిస్తారని, దీనిని ప్రతిరోజూ ఇంట్లో పూజిస్తారని చాణుక్యుడు చెప్పారు. మీ ఇంట్లో ఉన్న తులసి అకస్మాత్తుగా ఎండిపోతే.. ఇలా జరగడం ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయనడానికి సంకేతం. అటువంటి పరిస్థితిలో, మీరు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
చెడ్డ దృష్టి ఉన్న వ్యక్తి.. చెడు చేసేందుకే ఇష్టపడతాడు. అందుకే సమాజంలో, మీ చుట్టూ ఉన్నా మిమ్మల్ని ప్రభావితం చేసేందుకే ఇష్టపడతాడు. అలాంటి వారితో కలిసి జీవించే వారికి అపవాదు కూడా వస్తుంది. అంతే కాకుండా మీ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్లను కూడా తప్పుగా చూస్తారు.
ఇంట్లో కలతలు: ఏ కుటుంబంలో కలతలు, కష్టాలు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి నివసించదని చెబుతారు. లక్ష్మి నివసించాలంటే.. ఆ ఇంట్లో ప్రేమగా జీవించడం, పెద్దలను గౌరవించడం, ఇంటి కోడలును గౌరవించడం నేర్చుకోవాలి. ఇంటి కోడలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
చాకచక్యం లేని వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడటానికి, చెప్పడానికి వెనుకాడడు. మెల్లమెల్లగా అతని సొంతం అనేది కూడా అతని నుంచి దూరం కావడం మొదలవుతుంది. అలాంటి వారితో కలిసి జీవించడం వల్ల మీ ప్రవర్తన చెడుగా, ప్రతికూలంగా మారుతుంది.