Chanakya Niti: మీ జీవితంలో ఎదురయ్యే మోసగాళ్లను ఇలా గుర్తించవచ్చంటున్న ఆచార్య చాణక్య

|

Oct 06, 2022 | 12:55 PM

ప్రజలు ఇప్పటికీ ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరిస్తున్నారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలోని కష్టాలను దృఢంగా ఎదుర్కోగలడు. ఈ లక్షణాలను గుర్తిస్తే.. మోసగాళ్ళను కనుక్కోవడం చాలా సులభమని ఆచార్య చాణక్య చెప్పారు.

1 / 5
కామంతో మునిగితేలేవారు: కామంతో మునిగిపోయే వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించకూడదు. అలాంటి వ్యక్తిని నమ్మడం ద్వారా, ఒక వ్యక్తి పెద్ద సమస్యలో చిక్కుకునే అవకాశముంది. అందుకే అలాంటి వారితో ఎప్పుడూ దూరం పాటించండి. ఈ వ్యక్తుల వల్ల మీరు పరువు ప్రతిష్టకు భంగం కలగడమే కావకు.. చాలా నష్టాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు.

2 / 5
వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు.  ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది. 

3 / 5
సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి

4 / 5
అసూయతో ఉండే వ్యక్తులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని అస్సలు చూడలేరు. మీరు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అనేక అడ్డంకులను సృష్టిస్తారు. అందుకే వీరిని దరిచేరనివ్వొద్దని చాణుక్యుడు తెలిపాడు.

5 / 5
స్వార్థపరులు : ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి స్వార్థపరుల నుంచి దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎవరినీ పట్టించుకోరు. వారు తమ ప్రయోజనాల కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అందుకే వారికి దూరంగా ఉండండి అంటూ పేర్కొన్నాడు.