Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో ఎవరూ సంతోషంగా ఉండలేరు.. భూమికి భారం అంటున్న చాణక్య

Updated on: Oct 09, 2025 | 8:51 AM

చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన దాదాపు ప్రతి అంశాన్ని వివరించాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు నేటికీ అనుసరణీయం. ఈ బోధనలను మీ జీవితంలో అమలు చేస్తే.. గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఆచార్య చాణక్యుడు కొంత మంది వ్యక్తులను భూమికి భారంగా వర్ణించాడు. ఈ రోజు చాణక్య చెప్పిన ఆ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

1 / 5
ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప పండితులలో ఒకరు. ఆయన రచించిన చాణక్య నీతి నేటికీ సందర్భోచితంగా ఉంది. చాలా మంది చాణక్య నీతి శాస్త్రంలో చెప్పిన సూత్రాలను తమ జీవితాల్లో స్వీకరించి, సానుకూల ఫలితాలను సాదిస్తూనే ఉన్నారు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొన్ని రకాల వ్యక్తులను భారంగా వర్ణించిచాడు. వారు ఎవరంటే..

2 / 5
Chanakya niti

Chanakya niti

3 / 5
దానధర్మాలు చేయని వ్యక్తి : చాణక్య నీతి  ప్రకారం తాను సంపాదించిన సంపదలో కనీసం కొంత మొత్తాన్ని అయినా మంచి పనుల కోసం ఉపయోగించాలీ. అయితే తన సంపాదనని మంచి పనులకు ఉపయోగించకుండా..  దానధర్మాలు చేయకుండా.. కూడబెట్టడమే జీవిత లక్ష్యంగా బతికే వ్యక్తిని ఆచార్య చాణక్యుడు భూమికి భారంగా అభివర్ణించాడు. కనుక ఒక వ్యక్తి తన సంపదను సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైన వారికి, ఆపదలో ఉన్నవారికి  దానం చేయాలి.

4 / 5

ద్వేషం కలిగి ఉన్న వ్యక్తి : ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తూ.. ఎప్పుడూ నిరంతరం కఠినంగా మాట్లాడే వ్యక్తిని కుటుంబ సభ్యులే కాదు.. ఇతరులు కూడా ఇష్టపడరు. చికాకు కలిగించే వ్యక్తిగా భావిస్తారు. ఇతరుల పట్ల అసూయ,  ద్వేష భావాలను కలిగి ఉన్న వ్యక్తి భూమికి భారం అని పేర్కొన్నాడు చాణక్య.

5 / 5
స్త్రీలను, పెద్దలను గౌరవించని వ్యక్తి: కొంత మంది స్త్రీలంటే చాలా చులకనగా చూస్తారు.. అంతేకాదు పెద్దలు అన్న భయం భక్తి వంటి భావనలు కూడా ఉండవు. ఇటువంటి వ్యక్తులను ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావిస్తూ.. స్త్రీలను, పెద్దలను గౌరవించని వ్యక్తికి దేవుని ఆశీస్సులు ఎప్పటికీ లభించవని పేర్కొన్నాడు. అంతేకాదు చాణక్యుడు ఇలాంటి వ్యక్తులను భూమిపై భారంగా అభివర్ణించాడు.