
ఆ చార్య చాణక్యుడు, తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా నీటి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. అందులో బంధాలు, బంధుత్వాలు, డబ్బు, ఆర్థిక సమస్యలు, గెలుపు, ఓటమి, జీవితం ఇలా అనేక అంశాల గురించి పొందుపరిచారు.

ఆ చార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో, భూమి పై స్వర్గం లాంటి ఆనందాన్ని ముగ్గురు వ్యక్తులు అనుభవిస్తారని తెలియజేశాడు. ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారా? నీతి శాస్త్రంలోని రెండవ అధ్యాయం, మూడవ శ్లోకంలో చాణక్యుడు వివరించినదాని ప్రకారం, సంతోషంగా , చాలా ఆనందంగా, సంపన్నంగా ఉండే వ్యక్తులు మూడు రకాలంట. వారు ఎవరు అంటే?

కొడుకుపై పూర్తి నియంత్రణ : ఏ వ్యక్తి అయితే తన కొడుకును తన అదుపులో ఉంచుకొని పనులను నిర్వహించుకుంటాడో, అతను చాలా గొప్పవాడు మాత్రమే కాకుండా, భూమిపైనే స్వర్గం లాంటి జీవితాన్ని పొందుతాడంట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది తడ్రి మాటను లెక్క చేయడం లేదు, నిత్యం భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ఈ కాలంలో తండ్రి మాటను తీసేయకుండా, పనులు చేసే కొడుకు ఉన్నంత కాలం, ఆ తండ్రి ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తారంట.

తెలివైన భార్య : అంతే కాకుండా ఏ వ్యక్తికి అయితే చాలా తెలివైన భార్య వస్తుందో, అతను కూడా చాలా అదృష్టవంతుడు అని చెబుతున్నాడు చాణక్యుడు, విధేయురాలు అయిన భార్య భర్తకు మద్దతు ఇస్తుంది, కష్ట సమయంలో అండగా నిలుస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపుతుందంట.

తనకున్న సంపాదనతో తృప్తిపడే వ్యక్తి : ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. అంతే కాకుండా అమాయకులను మోసం చేస్తున్నారు. ఎప్పుడూ తృప్తిగా భోజనం చేయకుండా, డబ్బు సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ, ఉన్నదాంట్లో సంతృప్తి పడే వ్యక్తే గొప్పవాడు అని చెబుతున్నాడు చాణక్యుడు.